"కిల్ మస్క్స్ ట్విట్టర్"... హారిస్ టీమ్ పై సంచలన ఆరోపణలు!

అధ్యక్ష ఎన్నికల వేళ అగ్రరాజ్యం అమెరికా ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి.

Update: 2024-10-23 07:53 GMT

అధ్యక్ష ఎన్నికల వేళ అగ్రరాజ్యం అమెరికా ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు వారి మద్దతు దారుల నుంచి సంచలన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా... ఎక్స్ కు చెందిన డెయిలీ న్యూస్ వేదిక ఓ సంచలన విషయాన్ని పంచుకుంది. ఇందులో భాగంగా... ఎక్స్ ని తొక్కేయాలని హారిస్ టీమ్ ప్లాన్ చేస్తుందంట.

అవును... ఎక్స్ (ట్విట్టర్) ను అణచివేయాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ టీమ్ ప్లానింగ్ చేసిందని.. ఆమె టీమ్ లో బ్రిటన్ కు చెందిన పొలిటికల్ ఆపరేటివ్ మోర్గాన్ మెకస్వీనీ ఒకరని.. అతడు "సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్" అనే సంస్థను నిర్వహిస్తున్నాడని.. ఇదే సమయంలో.. బ్రిటన్ ప్రధాని పార్టీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్ సంస్థకు చెందిన పత్రాలను "ది డిస్ ఇన్ఫర్మేషన్ క్రానికల్" సంస్థ బహిర్గతం చేసిందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. "కిల్ మస్క్స్ ట్విట్టర్" పేరిట ఉన్న దీనిలో ఎక్స్ ను ఆర్థికంగా స్థిరపరచడంతో పాటు.. ప్రకటనలు ఇచ్చేవారిని భయపెట్టడం వంటివీ ఉన్నాయని పేర్కొన్నారు.

దీంతో... ఈ తాజా పరిణామాలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇందులో భాగంగా... ఇది అమెరికాలో క్రిమినల్ చట్టాలను ఉల్లంఘిస్తూ, ఎన్నికల్లో జోక్యం చేసుకొనే అంశం ఉందని అన్నారు. ఇదే సమయంలో... సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్, దాని దాతలపైనా పోరాడతామని పేర్కొన్నారు.

కాగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఎలాన్ మస్క్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ట్రంప్ కు మస్క్.. ఫైనాన్షియల్ గా, మోరల్ గా, మెంటల్ గా, మొదలైన విధాలుగా సపోర్ట్ గా ఉంటున్నారని అంటున్నారు! మరోవైపు.. తాను ప్రెసిడెంట్ అయితే మస్క్ ను తన సలహాదారుడిగా నియమించుకోవాలని ట్రంప్ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది!

Tags:    

Similar News