ట్రంప్ కోసం మస్క్ భారీ విరాళం... ఎంతంటే...?

ఈసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే.. ఆయనకు సలహాదారుడిగా ఎలాన్ మస్క్ వైట్ హౌస్ కి వెళ్లే అవకాశాలున్నాయంటూ ఇటీవల కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే

Update: 2024-07-14 01:30 GMT

ఈసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే.. ఆయనకు సలహాదారుడిగా ఎలాన్ మస్క్ వైట్ హౌస్ కి వెళ్లే అవకాశాలున్నాయంటూ ఇటీవల కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని మస్క్ బలంగా కోరుకుంటున్నారని, మరింత బలంగా బలపరుస్తున్నారని అంటుంటారు. ఈ సమయంలో మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఈ టెస్లా అధినేత పెద్ద మొత్తంలో విరాళం అందించారని అంటున్నారు. అయితే... అది ఎంతంటే...? మాత్రం సరైన సమాధానం రావడం లేదు!

వాస్తవానికి... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అటు డొనాల్డ్ ట్రంప్ కు కానీ, ఇటు జో బైడెన్ కి కానీ తన వైపు నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం ఉండబోదు అంటూ గతంలో ప్రకటించారు మస్క్. అయితే... తాజాగా వస్తోన్న కథనాల ప్రకారం... తాజాగా ట్రంప్ తరుపున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీకి మస్క్ భారీ విరాళం అదించాడని అంటున్నారు.

దీంతో... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదో ఆసక్తికర కీలక పరిణామంగా చెబుతున్నారు పరిశీలకులు. ఆయన ఎంత ఇచ్చాడనేదానికంటే... ట్రంప్ కు మస్క్ మద్దతుపై ఉన్న సందేహాలు కూడా క్లియర్ అయిపోయినట్లే అని అంటున్నారు పరిశీలకులు.

కాగా... ఇటీవల జరిగిన బిడ్ డిబేట్ లో బైడెన్ తడబడ్డారని, ట్రంప్ పై చేయి సాధించారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. నెట్టింట ఇలాంటి ప్రచారం బలంగా జరిగింది. దీంతో... ట్రంప్ ప్రచారానికి కార్పొరేట్ విరాళాలు పోటెత్తుతున్నాయని ఆంటున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ కుబేరుడు కూడా ట్రంప్ కు భారీ విరాళం అందించాడని చెబుతున్నారు.

అయితే అది ఎంత పెద్ద మొత్తం అనే విషయాలు ఇప్పుడు చెప్పకపోయినా... ఈ నెల 15న ట్రంప్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.. ఆ విరాళాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి... అప్పటి వరకూ కాస్త వెయిట్ చేస్తే... ట్రంప్ కోసం మస్క్ ఎంత విరాళం ఇచ్చిందీ బయటకొచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News