బీ అలర్ట్‌.. విస్కీ ఐస్‌ క్రీములతో పిల్లలకు ఎర!

ఐస్‌ క్రీముల పార్లర్‌ నిర్వాహకుడు దయాకర్‌ రెడ్డి, శోభన్‌ లను అరెస్టు చేశారు.

Update: 2024-09-06 09:36 GMT

హైదరాబాద్‌ నగరంలో విస్కీ ఐస్‌ క్రీములు హల్‌ చల్‌ చేస్తున్నాయి. 100 ఎంఎల్‌ విస్కీతో కలిపి 60 గ్రాముల విస్కీని పిల్లలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ 1, 5 రోడ్డుల్లో ఉన్న అరికో ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌ పై ఎక్సైజ్‌ అధికారులు తాజాగా జరిపిన దాడుల్లో ఈ విస్కీ ఐస్‌ క్రీములను గుర్తించారు. వీటిని పిల్లలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

ఐస్‌ క్రీముల పార్లర్‌ నిర్వాహకుడు దయాకర్‌ రెడ్డి, శోభన్‌ లను అరెస్టు చేశారు. 11.5 కేజీల విస్కీ ఐస్‌ క్రీమ్స్‌ ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1 ,5ల్లో అరికో కేఫ్‌ ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌ ల్లో గుట్టుచప్పుడు కాకుండా విస్కీ ఐస్‌ క్రీమ్‌ అమ్మకాలు సాగిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

చిన్నారులు, ఈ యువకులు భారీగా ఈ విస్కీ ఐస్‌ క్రీములను కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. 60 గ్రాముల ఐస్‌ క్రీములో 100 మి.లీ విస్కీని కలుపుతున్నారు. ఈ ఐస్‌ క్రీమ్‌ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లో ఇంకా ఎన్ని ఇలాంటి పార్లర్లు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఈ విస్కీ ఐస్‌ క్రీములపై ఎంత సంపాదించారనేది కూడా ఆరా తీస్తున్నారు.

విస్కీ కలిపి అమ్ముతున్న ఐస్‌ క్రీములను తింటున్న పిల్లలకు ప్రాణాపాయం ఉంటుందని చెబుతున్నారు. చిన్న పిల్లల ఆహార పదార్థాలకు సంబంధించి ఇలాంటి దారుణాలకు దిగుతున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విస్కీ కలిపిన ఐస్‌ క్రీముల వ్యవహారం వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News