వైసీపీకి రాజీనామా మీద మాజీ మంత్రి తేల్చేశారు....!

దీంతో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న సామెత మాదిరిగా తప్పుడు ప్రచారాలూ సాగిపోతున్నాయి.

Update: 2024-01-06 09:35 GMT

ఎన్నికల సీజన్ నడుస్తోంది. అదే టైం లో టికెట్ల విషయంలో అధినాయకత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. టికెట్ దక్కని వారు అలుగుతున్నారు. కొందరు రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారు. దీంతో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న సామెత మాదిరిగా తప్పుడు ప్రచారాలూ సాగిపోతున్నాయి. సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి.

దీంతో రాజీనామాలు చేయలేదు అని కూడా కీలక నేతలు చెప్పుకోవాల్సి వస్తోంది. వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఖండించారు. వైసీపీని వీడి తాను టీడీపీలోకి వెళ్తున్నట్లుగా జరుగుతున్న దుష్ప్రచారం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదు అని ఆయన స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున ఒంగోలు నుంచే పోటీ చేస్తాను అని బాలినేని పేర్కొనడం గమనార్హం. అదే విధంగా తను విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తాను అని ఆయన అంటున్నారు. విలువల కోసమే గతంలో తాను మంత్రి పదవిని సైతం వదులుకుని వైసీపీ వైపు ఉన్నాను అని గుర్తు చేసారు. ఆనాడు తాను జగన్ వెంట నడవడం వెనక విలువలతో కూడిన రాజకీయాలే కారణం అన్నారు.

అయితే సామాజిక సమీకరణల నేపధ్యంలో వైసీపీలో పలు చోట్ల ఎమ్మెల్యేల స్థానాలలో మార్పుచేర్పులు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తనకు గిద్దలూరు సీటుని కేటాయించారని వస్తున్న వార్తలను కూడా ఈ మాజీ మంత్రి ఖండించారు. తాను గిద్దలూరు నుంచి పోటీ చేయడం లేదు అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచి వైసీపీ తరఫునే పోటీలో ఉంటాను అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు గట్టిగానే స్పష్టం చేశారు. మరి దీని మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు.

Tags:    

Similar News