బంగ్లాలో హిందువులకు కొత్త కష్టం... 5 లక్షలు చెల్లిస్తేనే దుర్గాపూజకు అనుమతి!
బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పరిస్థితులు అనధికారికంగా ఇంకా చక్కబడలేదనే చెప్పాలి.
బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పరిస్థితులు అనధికారికంగా ఇంకా చక్కబడలేదనే చెప్పాలి. అక్కడ ఉన్న హిందువుల కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ లో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన దాడుల నేపథ్యంలో వచ్చిన పరిణామం ఇంకా సంక్షిష్టంగానే ఉందని అంటున్నారు.
అవును... బంగ్లాదేశ్ లో జరిగే అతిపెద్ద హిందూ పండుగ గురించి పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. బెదిరింపులతో పాటు దుర్గా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని అక్కడ హిందూ సంఘాల సభ్యులు చెబుతున్నారు. తాజాగా పూజలు జరుపుకోవడానికి భారీగా రుసుము చెల్లించాలని బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... దుర్గాపూజ విషయంలో బంగ్లాదేశ్ లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు పూజా కమిటీలు, దేవాలయాలను బెదిరిస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... అక్టోబరు 9 నుంచి 13 వరకూ దుర్గాపూజ నిర్వహించ్కోవాలంటే తమకు ఐదు లక్షల బంగ్లాదేశ్ టాకాలు చెల్లించాలని అల్టిమేటం జారీ చేశారని చెబుతున్నారు.
ఈ సందర్భంగా చెల్లింపులు చేయడంలో విఫలమైతే దుర్గాపూజ జరుపుకోవడానికి అనుమతించబోమని.. కీలక పరిణామాలు ఉంటాయని పలు పూజా కమిటీఅలకు ఇప్పటికే కొన్ని అనామక లేఖల్లో బెదిరింపులు వచ్చాయని అంటున్నారు. దీంతో... ఇటీవల చిట్టగాంగ్, ఖుల్నా జిల్లాల్లోన్ని పలు హిందూ సంఘాల సభ్యులు సంబంధిత అధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే పలు చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22న లక్ష్మీగోంజ్ జిల్లాలోని రాయ్ పూర్ ప్రంతంలో కొందమంది కుర్రాళ్లు దుర్గా విగ్రహాలను ధ్వంసం చేశారని అంటున్నారు. ఇదే సమయంలో... బార్గునా జిల్లాలోని గలాచిపా ఆలయంలోనూ విగ్రహాలను ధ్వంసం చేశారని అంటున్నారు.
దీంతో... ఈ ఏడాది దుర్గాపూజను బంగ్లాదేశ్ లోని హిందువులు స్వేచ్ఛగా జరుపుకోవడం కష్టమని స్థానిక హిందూ కమిటీ నాయకులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకోనుందనేది వేచి చూడాలి.