కామంతో కళ్లు మూసుకుపోయిన 'కంచె'.. 'చేను'ను మేసింది!?
వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని పులియంతోప్ లో ఓ 45ఏళ్ల వ్యక్తి, ఓ మహిళ, ఆరు నెలల కుమార్తె నివసిస్తున్నారు.
కొన్ని విషయాలు తెలియకపోతేనే బాగుటుంది అనిపిస్తుంటుంది.. మరికొన్ని విషయాలు తెలుసుకోకపోతేనే ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంటుంది! అలాంటి కొన్ని విషయాలు ప్రజల్లోకి రావడం వల్ల సమాజంపై మరింత అసహ్యం కలుగుతుందనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాంటి అత్యంత దారుణమైన, ఘోరమైన విషయం తాజాగా తెరపైకి వచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కంచె చేను మేసింది!!
అవును... తండ్రి అంటే ఆడపిల్లకు ఆ భగవంతుడి కంటే ఎక్కువ అని అంటారు! దోమ కుట్టకుండా, ఈగ వాలకుండా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి ఆడపిల్లకు ఎవరైనా ఉంటే అది ముందుగా తండ్రి మాత్రమే అని చాలా మంది నొక్కి చెబుతుంటారు! అయితే అత్యంత దారుణంగా... 45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి 6 నెలల వయసున్న కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని పులియంతోప్ లో ఓ 45ఏళ్ల వ్యక్తి, ఓ మహిళ, ఆరు నెలల కుమార్తె నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆ బాలికకు అనుమానాస్పదంగా తలకు గాయమైంది. ఇది గమనించిన తల్లి... ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. అయితే ఈ సమయంలో ఆ ఆరునెలల బాలిక ప్రైవేట్ పార్ట్స్ పై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారట. దీంతో వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కు సమాచారం అందించారు.
ఇదే సమయంలో పోలీసులకూ ఫిర్యాదు చేశారు! దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆ వ్యక్తిని ప్రశ్నించగా.. తన సొంత కూతురిపై తాను ఎందుకు అలాంటి పనులకు పాల్పడతాను అంటూ బుకాయించాడు. అయితే... పోలీసులు కస్త "గట్టి"గా ప్రశ్నించారో ఏమో కానీ... వాస్తవాలు వెల్లడించి, నేరాన్ని అంగీకరించాడని అంటున్నారు.
ఇందులో భాగంగా ఆరు నెలలున్న తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు అంగీకరించాడని చెబుతున్నారు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో నెటిజన్లు అత్యంత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లకు కలలో కూడా ఊహించనటువంటి కఠినమైన శిక్షలు అమలుచేయాలని కోరుతున్నారు. అప్పుడే ఇలాంటి ఆలోచనలు ఉన్నవారి వెన్నులో వణుకు పుడుతుందని అంటున్నారు.