గుండెలు పిండేలా.. ప్రైవేటు ఆసుపత్రిలో నిప్పు.. ఏడుగురు మృతి

పెద్ద ఎత్తున ఫైరింజన్లు రంగంలోకి దిగి అర్థరాత్రి దాటిన తర్వాత కానీ మంటల్ని అదుపులోకి తీసుకురాలేకపోయారు.

Update: 2024-12-13 04:32 GMT

తమిళనాడులో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని అగ్నిప్రమాదం ఏడు ప్రాణాల్ని తీసింది. తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా కేంద్రంలోని తిరుచ్చి రోడ్డులో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి హటాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారి తీవ్ర గందోరగోళం చోటు చేసుకుంది. మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ప్రైవేటు ఆసుపత్రికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఫైరింజన్లు రంగంలోకి దిగి అర్థరాత్రి దాటిన తర్వాత కానీ మంటల్ని అదుపులోకి తీసుకురాలేకపోయారు.

ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ఏడుగురు మరణించారు. ప్రత్యక్ష సాక్ష్యులు.. స్థానికులు ఇస్తున్న సమాచారం ప్రకారం నాలుగు అంతస్తులు ఉన్న ప్రైవేటు ఆసుతపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగిన కాసేపటికే ఆసుపత్రిని చుట్టుముట్టాయని వెల్లడించారు. హటాత్తుగా మంటల చెలరేగటం.. దట్టమైన పొగ కారణంగా ఏమీ కనిపించని పరిస్థితి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు ఆసుపత్రి సిబ్బంది..రోగులు.

దీంతో.. ఎవరికి వారు పరుగులు తీస్తూ ఆసుపత్రి బయటకు వచ్చేశారు. అగ్నిప్రమాద ఘటన సమాచారం విన్నంతనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది? అన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం అన్ని అగ్నిప్రమాదాల మాదిరే షార్ట్ సర్క్యూట్ కారణమన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అధికులు రోగులేనని చెబుతున్నారు. ప్రమాద ఘటన జరిగిన విషయం తెలిసిన కాసేపటికే అధికారులు 50 అంబులెన్సులను ఏర్పాటు చేసి రోగుల్ని ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మరణాల సంఖ్య పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News