విశాఖలో ఘోర అగ్నిప్రమాదం.. టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల 'ఫైరింగ్'!
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. హుటాహుటి న రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
విశాఖలోని బీచ్‌లో రోడ్డులో ఉన్న 'డైనో పార్క్'లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం 12 గంటల తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో ఇక్కడ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. భారీ ఎత్తున ఎగసిపడిన మంటలు.. సమీపంలోని రోడ్డు మీదకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. హుటాహుటి న రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
నిత్యం అత్యంత రద్దీగా ఉంటే డైనో పార్కు గురించి... ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామకృష్ణ బీచ్‌లో చిన్నారుల కోసం.. దీనిని ఏర్పాటు చేశారు. బీచ్‌కు వచ్చే సందర్శకులకు ఇది ఆనందాన్ని, ఆహారాన్ని కూడా అందిస్తోంది. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టేలా దీనిలో ఏర్పాట్లు ఉన్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా ఇక్కడ కూర్చుని.. సముద్ర కెరటాల సవ్వడులను ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి పార్క్ మంటల్లో చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ ప్రమాదంపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 1) విద్యుత్ షార్ట్ సర్క్యూట్ 2) ఉద్దేశ పూర్వకంగా కొందరు అలజడి సృష్టించేందుకు, నగరం బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు చేసిన చర్యగా పేర్కొంటున్నారు. వాస్తవానికి షార్ట్ సర్య్కూట్ అయితే.. సిబ్బంది ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. అలా కాకుండా.. సంఘ విద్రోహ శక్తుల పనే అయితే.. నిత్యం అత్యంత బిజీగా ఉండే ఈ రోడ్డులోనే ఇలా చేశారంటే దీని వెనుక ఎవరున్నా రనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి విశాఖ బ్రాండ్పై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తు న్నారు. వైసీపీ హయాంలో ఏర్పాటైనందుకే దీనిని తగుల బెట్టారని దీనివెనుక అధికార పార్ట కార్యకర్తలు ఉన్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇక, ఇప్పుడు రాజకీయ విమర్శలే మిగిలాయి.