కుటుంబం ఎదుటే దారుణ హత్యకు గురైన మాజీ క్రికెటర్!
మంగళవారం రాత్రి శ్రీలంకలోని అంబలన్ గోడలో దారుణం జరిగిపోయింది.
మంగళవారం రాత్రి శ్రీలంకలోని అంబలన్ గోడలో దారుణం జరిగిపోయింది. ఈ ప్రాంతంలోని తన నివాసంలో శ్రీలంక మాజీ క్రికెటర్ దమ్మిక నిరోషన (41) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భార్య, పిల్లల ఎదుటే అతడిని ఓ దుండగుడు దారుణంగా కాల్చి చంపాడు. క్రికెట్ ప్రపంచంలో ఈ వార్త షాకింగ్ గా మారింది.
అవును... శ్రీలంక మాజీ క్రికెటర్ దమ్మిక నిరోషన పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిరోషన mRti చెందారు. ఈ ఘటన అతని భార్య, పిల్లల కళ్లెదుటే జరగడం గమనార్హం. అయితే... ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో పలువురు కికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీలంకలోని గాలె జిల్లాలోని అంబాలన్ గోడా ప్రాంతంలో దమ్మిక నిరోషన గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దమ్మిక ఇంట్లోకి చొరబడి అతనిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన దమ్మిక భార్య పిల్లల ముందే జరిగింది. అనంతరం ఆ దుండగుడు అక్కడ నుంచి పారిపోయాడు. దమ్మిక అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు పొస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా... 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్ - 19 జట్టుకు దమ్మిక నిరోషన కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్ లకూ ప్రాతినిధ్యం వహించారు. అయితే... తన వ్యక్తిగత కారణాలవల్ల 20 ఏళ్లకే అతడు క్రికెట్ ను వదిలేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన దమ్మిక... ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 12, లిస్ట్ - ఏ లో 8 మ్యాచ్ లు ఆడారు.