గాజువాకలో బిగ్ ట్విస్ట్...వైసీపీ సక్సెస్ అక్కడే...!?

గాజువాకలో వైసీపీ వ్యూహం మార్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు బదులుగా ఒక బలమైన సామాజికవర్గానికి పెద్ద పీట వేస్తూ ఇంచార్జి పదవిని అప్పగించింది. గా

Update: 2023-12-13 03:45 GMT

గాజువాకలో వైసీపీ వ్యూహం మార్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు బదులుగా ఒక బలమైన సామాజికవర్గానికి పెద్ద పీట వేస్తూ ఇంచార్జి పదవిని అప్పగించింది. గాజువాక జనాభా రెండు లక్షలు అయితే కాపులు యాదవులు డామినేటింగ్ రోల్ ప్లే చేస్తారు. రాజకీయంగా చూస్తే వీరే ప్రభావితం చేసే స్థితిలో ఉంటారు.

పెందుర్తి నుంచి విడిపోయి 2009లో గాజువాక ఏర్పడింది. జస్ట్ రెండు లక్షల ఓటర్లు ఉంటారు. 2009లో కాపు సామాజికవర్గం నేతగా ఉన్న చింతలపూడి వెంకటరామయ్య ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో యాదవ సామాజికవర్గం నుంచి పల్లా శ్రీనివాసయాదవ్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో రెడ్డి సామాజికవర్గం నుంచి వైసీపీ తరఫున తిప్పల నాగిరెడ్డి గెలిచారు.

ఇక తిప్పల కుటుంబానికి పెందుర్తి గాజువాకలలో బలం ఉండడంతో పాటు జగన్ ప్రభంజనం కూడా దోహదపడి నాడు భారీ విజయం దక్కింది. అది కూడా పవన్ కళ్యాణ్ మీద తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. టీడీపీ యాదవ కమ్యూనిటికి ప్రయారిటీ ఇస్తూ పల్లా శ్రీనివాసరావుని పోటీకి దింపింది. ఇక జనసేన నుంచి పవన్ పోటీ చేశారు. ఆయనకు మరో బలమైన కాపు సామాజికవర్గం కొమ్ము కాసిందని టాక్.

అయినా సరే ట్రయాంగిల్ ఫైట్ లో వైసీపీ విజేత అయింది. కానీ 2024లో అలా జరిగే అవకాశం అయితే అసలు లేదు. ఈసారి కాస్ట్ ఈక్వేషన్స్ గట్టిగా పనిచేస్తాయని అంటున్నారు. ఇక ఈ సీటు కచ్చితంగా జనసేనకు వెళ్తోంది అని అంటున్నారు. దాంతో కాపులు అటు టర్న్ అయితే యాదవులు మిగిలిపోతారు. దాంతో అన్నీ ఊహించి వైసీపీ యాదవులకే టికెట్ అని ఇంచార్జిని ముందుగా ప్రకటించింది.

ఇక ఉరుకూటి రామచంద్రరవు ఉరవ్ చందు అనే నాయకుడు రాజకీయ కుటుంబం నేపధ్యం ఉన్న వారు. ఆయన తండ్రి ఉరుకూటి అప్పారావు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన కూడా కార్పోరేటర్ గా పనిచేశారు. ఇపుడు కుమారుడు రాజకీయ వారసుడు అయ్యారు.

దాంతో బలమైన సామాజిక నేపధ్యం కూడా తోడు కావడంతో ఆయనకు టికెట్ ఇవ్వాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. అంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసినా కూడా బీసీకి టికెట్ ఇవ్వడం ద్వారా సక్సెస్ ని తన సైడ్ ఉంచుకోవాలని వైసీపీ ఈ స్టాండ్ తీసుకుంది అని అంటున్నారు. ఇక తిప్పల ఫ్యామిలీ కూడా తాము వైసీపీలో ఉంటామని ప్రకటించడం శుభ పరిణామం అంటున్నారు.

మొత్తానికి వైసీపీ ముందుగానే తేల్చింది. ఇపుడు జనసేన టీడీపీ తమ క్యాండిడేట్ ఎవరో చూడాల్సి ఉంది. జనసేనలో కూడా యాదవ సామాజికవర్గం నుంచి కోన తాతారావు పోటీకి సిద్ధపడుతున్నారని టాక్. అయితే కాపుల నుంచి కొందరు కీలక నేతలు రేసులో ఉన్నారు. టికెట్ ఎవరికి ఇస్తారో తెలియదు కానీ వైసీపీ మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చేసింది అని అంటున్నారు.

Tags:    

Similar News