మేరా భారత్ మహాన్: మసీదు సమీపంలో విగ్రహం పడిన వేళ ముస్లిం యువకుల పని వావ్

భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఈ మాటను గుర్తు చేసే ఉదంతాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి.

Update: 2023-10-01 15:09 GMT

భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఈ మాటను గుర్తు చేసే ఉదంతాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. రాజకీయాల కారణంగా మతాల మధ్య చిచ్చు పెట్టే నాయకుల తీరు ఎలా ఉన్నా.. రెండు వర్గాల ప్రజల మధ్య ఉండే సోదరభావం చూసినప్పుడు వావ్.. ఇది కదా ఇండియా అంటే అన్న భావన కలిగిస్తూ ఉంటుంది. అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ లో జరిగిన వినాయక నిమజ్జన సందర్భంగా చోటు చేసుకుంది. కాకుంటే.. ఈ విషయాన్ని మీడియా గుర్తించలేదు కానీ.. సీపీ ఫుటేజ్.. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు పుణ్యమా అని ఈ విషయం బయటకు వచ్చింది.

తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అందులో ఆయనో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. యూసఫ్ గూడ లక్ష్మీనరసింహనగర్ స్థానిక జాంగీర్ ఖాన్ మసీదు సమీపంలో చోటు చేసుకున్న ఉదంతం గురించి వెల్లడించారు. సెప్టెంబరు 28 రాత్రి వినాయక నిమజ్జనంలో భాగంగా వినాయక విగ్రహాన్ని తరలిస్తున్నారు.

అనుకోకుండా అక్కడి తీగలకు తగిలి వినాయక విగ్రహం కిందకు పడిపోయింది. దీంతో.. భయాందోళనలకు గురైన వాహనంలోని మహిళలు కేకలు వేశారు. దీంతో.. అక్కడ సమీపంలోని ముస్లిం యువకులు ఫయిం.. జాఫర్.. వసీం.. ముబషీర్.. ముదస్సీర్ తదితరులు వెంటనే స్పందించి.. కింద పడిన వినాయక విగ్రహాన్ని మళ్లీ వాహనంలోకి ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు ముస్లిం యువకుల్ని అభినందిస్తూ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ వారికి అభినందనలు తెలియజేస్తూ.. ట్వీట్ చేయటంతో ఈ విషయం అందరికి తెలిసేలా చేసింది.

Tags:    

Similar News