మొదటి టెస్ట్ పై పెరిగిపోతున్న ఉత్కంఠ

మొదటి టెస్టంటే క్రికెట్ టెస్టు కాదు. ఉత్తరప్రదేశ్ లో ఘోసీ అసెంబ్లీకి ఉపఎన్నిక జరిగింది. మంగళవారం జరిగిన ఉపఎన్నిక రిజల్టు శుక్రవారం వస్తుంది

Update: 2023-09-06 09:07 GMT

మొదటి టెస్టంటే క్రికెట్ టెస్టు కాదు. ఉత్తరప్రదేశ్ లో ఘోసీ అసెంబ్లీకి ఉపఎన్నిక జరిగింది. మంగళవారం జరిగిన ఉపఎన్నిక రిజల్టు శుక్రవారం వస్తుంది. బీజేపీ తరపున ధారా సింగ్ చౌహాన్, ఎస్పీ తరపున సుధాకర్ సింగ్ పోటీచేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎన్డీయే అభ్యర్ధిగా ధారాసింగ్ ను పరిగణిస్తే ఇండియా కూటమి తరపున సుధాకర్ సింగ్ ను పరిగణిస్తున్నారు. ఇండియా కూటమి ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి ఉపఎన్నిక ఇదే.

అందుకనే ఇండియాకూటమి-ఎన్డీయే మధ్య దీన్ని మొదటి టెస్టుగా అందరు చూస్తున్నారు. ఎలాగంటే ధారాసింగ్ ను ఓడించేందుకు ఇండియాకూటమి మొత్తం సుధాకర్ కే మద్దతుగా నిలబడ్డాయి. ఎస్పీ అభ్యర్ధికి సింగ్ కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆర్ఎల్డీ, ఆప్ మద్దతుగా నిలిచాయి. ప్రచారం, ఎలక్షనీరింగ్ మొత్తాన్ని ఇండియాకూటమి పార్టీలు చాలా పకడ్బందీగా నిర్వహించాయి. అలాగే బీజేపీ అభ్యర్ధి ధారాసింగ్ కు ఎన్డీయే పార్టనర్ అప్నా లోకదళ్, నిషాద్ పార్టీలు మద్దతుగా నిలిచాయి.

ఘోసీతో పాటు మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నికలు జరిగినా ఘోసీ ఉపఎన్నికనే ఇండియాకూటమి బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అందుకనే ఈ నియోజకవర్గంలో గెలవాలన్న పట్టుదలతో ఇండియాకూటమి చాలా కష్టపడింది. పై పార్టీల్లోని లోకల్ నేతలంతా కట్టుదిట్టంగా పనిచేశారు. 2022లో జరిగిన ఎన్నికల్లో 58.59 శాతం ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 4.30 లక్షల ఓట్లున్నాయి.

ఇందులో ముస్లింలు 90 వేలు, దళితులు 60 వేలు, భూమిహారులు 45 వేలు, 16 వేలు, రాజ్ పుత్తులు 16 వేలు, బ్రాహ్మణుల ఓట్లు 6 వేలున్నాయి. మిగిలిన ఓట్లు ఇతర సామాజికవర్గాలవి. తాజా ఉపఎన్నికకు బీఎస్పీ దూరంగా ఉంది. కాబట్టి ఎన్డీయే-ఇండియాకూటమి అభ్యర్ధుల మధ్య పోటీ ఫేస్ టు ఫేస్ అన్నట్లే జరిగింది. పోటీలో మరో పదిమంది దాకా ఉన్నప్పటికీ వాళ్ళు పెద్దగా లెక్కలోకి రావటంలేదు. ఈ ఉపఎన్నికలో గనుక ఇండియాకూటమి అభ్యర్ధి గెలిస్తే కూటమి నేతల్లో కాస్త ఊపొస్తుంది. అంతమాత్రాన బీజేపీకి లేదా ఎన్డీయేకి పోయేదేమీ లేదు.

Tags:    

Similar News