మంత్రిపదవి రానందుకు బాధ లేదు కానీ... బుచ్చయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మంత్రి పదవులపై కీలకమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-14 16:30 GMT

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మంత్రి పదవులపై కీలకమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు యువ, సీనియర్ల సమతూకాన్ని పాటించారని కొంతమంది అంటుంటే... మోస్ట్ సీనియర్స్ ని లైట్ తీసుకున్నారనే కామెంట్లూ తదనుగుణంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ సమయంలో టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు తెరపైకి వచ్చింది.

అవును... 2019లో అంత ఫ్యాన్ గాలిలోనూ గెలిచిన బుచ్చయ్య చౌదరి, తాజాగా ఎన్నికల్లోనూ మరోసారి గెలిచారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయనకు... మంత్రిపదవి దక్కకపోవడానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సమయంలో బుచ్చయ్య ఆసక్తికరంగా స్పందించారు.

ఇందులో భాగంగా... తనకు మంత్రిపదవి దక్కకపోవడంలో తప్పేమీ లేదని చెప్పిన ఆయన... ప్రభుత్వంలో పలు సమీకరణలు, సర్ధుబాట్లు ఉంటాయని అన్నారు. మంత్రి పదవి దక్కుతుందని నేను ఆశించాను, మీరూ ఆశించారు, లక్షలాదిమంది మిత్రులు కూడా ఆశించారు అని అన్నారు. ఇదే క్రమంలో 42 ఏళ్లుగా ఏ పదవి ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలని అన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని నీతులు చెబుతున్నారని అన్నారు.. ఈ సమయంలో జగన్ పాదయాత్ర చేస్తే రాళ్లు, చెప్పులూ వేస్తారని అన్నారు. మరో ఐదేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తారని అంటున్నారు.. అసలు అప్పటికి చంచల్ గూడ జైల్లో ఉంటారో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు!

Read more!

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టబోమని, చట్టప్రకారం చర్యలుంటాయని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. ప్రధానంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన భూ అక్రమాలపైనా విచారణ చేయిస్తామని ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి తెలిపారు.

ఇక ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రకారం సామాజిక పింఛన్ సాయాన్ని రూ.3వేల నుంచి రూ.4వేలకు సీఎం చంద్రబాబు పెంచారని చెప్పిన బుచ్చయ్య చౌదరి... సంక్షేమంపైనే కాకుండా.. అభివృద్ధిపైనా తమ ప్రభుత్వం దృష్టి పెడుతోందని తెలిపారు. ఇదే సమయమోలో అన్న క్యాంటీన్లను తెరిపిస్తున్నామని అన్నారు.

Tags:    

Similar News