'అది మాత్రం మరిచిపోవద్దు'... 'ఏఐ'పై యువతకు అంబానీ కీలక సూచనలు!
పైగా అది ఉచితం కావడంతో.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది యూజర్స్ దాన్ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించిన చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా... ఇటీవల చైనా రూపొందించిన కొత్త ఏఐ మోడల్ డీప్ సీక్ ఎంట్రీతో ఈ చర్చ మరింత బలంగా జరుగుతుంది. పైగా అది ఉచితం కావడంతో.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది యూజర్స్ దాన్ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు.
ఇందులో భాగంగా... యాపిల్ యాప్ స్టోర్ లో ఇప్పటికీ డీప్ సీక్ యాప్ అగ్రస్థానంలో ఉండగా.. అటు గూగుల్ ప్లే స్టోర్ లోనూ ఇదే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెబుతున్నారు. అమెరికాలోనే కాకుండా సుమారు 51 దేశాల్లోని ప్లే స్టోర్స్ లో ఇదే అగ్రస్థానంలో ఉంది. ఈ సమయంలో.. ఏఐ పై ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు అంబానీ.
అవును... గుజరాత్ లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన అనిల్ అంబానీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని.. అయితే, ఈ క్రమంలో సొంతంగా ఆలోచించడం మరవరాదని తెలిపారు. ఈ ఏఐ వల్ల సొంత ఆలోచనలు వదులుకోవద్దని అన్నారు.
ఇదే సమయంలో.. ఏఐ ఒక టూల్ లా ఉపయోగపడుతుందంటే అంగీకరిస్తున్నాను కానీ.. మన మేధస్సును ఉపయోగించుకోవడం మాత్రం మరిచిపోవద్దని అన్నారు. కాలేజీ పూర్తి అయిన తర్వాత అసలైన లైఫ్ లో అడుగుపెట్టనున్నారని.. అక్కడ టీచర్స్ ఉండరని.. మీరు నేర్చుకునేది మీ మీ సొంత అనుభవాల ద్వారా మాత్రమే అని అంబానీ పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ హల్ చల్ చేస్తున్న వేళ.. మరోపక్క ఏఐ ఆధారిత సంస్థలపైనే ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్న సమయంలో.. యువత ఏఐ కి అడిక్ట్ అవుతున్నారనే చర్చ మొదలైన తరుణంలో అంబానీ వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి.