అల్లు అర్జున్ అరెస్టుతో వెళ్లిన సంకేతాలేంటి?

అంతకు మించిన భక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతన్న విషయం రేవంత్ సర్కారు స్పష్టం చేసిందన్న మాట వినిపిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టుతో ఎలాంటి సంకేతాలు వెళ్లాయన్నదిప్పుడు చర్చగా మారింది.

Update: 2024-12-15 08:30 GMT

ఒక్క ఘటనతో లెక్కలు చాలానే మారిపోయాయి. ఇంతకాలం పెద్దగా పట్టించుకోని పెద్ద తలకాయలు మొదలు కొని ప్రభుత్వాలను ప్రభావితం చేసే వారి వరకు అందరిలోనూ తెలియని భయాన్ని.. అంతకు మించిన భక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతన్న విషయం రేవంత్ సర్కారు స్పష్టం చేసిందన్న మాట వినిపిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టుతో ఎలాంటి సంకేతాలు వెళ్లాయన్నదిప్పుడు చర్చగా మారింది.

అదేమిటో కానీ.. కొందరు నేతలు సీఎం కుర్చీలో కూర్చున్నంతనే.. ఆటోమేటిక్ అందరిలోనూ ఒకలాంటి భక్తి ఆరాధాన భావన తన్నుకుంటూ వచ్చేస్తుంది. మరికొందరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. కాకుంటే.. రేవంత్ ను చాలామంది సీరియస్ గా తీసుకోలేదన్న మాటే బలంగా వినిపిస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ ను అరెస్టు చేసేందుకు రేవంత్ సర్కారు ఏ మాత్రం వెనుకాడకపోవటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది,

ఇదంతా ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ అరెస్టుపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ఎలాంటి సుత్తి లేకుండా వివరణ ఇచ్చేయటంతో పాటు పుష్ప ఏమీ అమాయకుడు కాదని.. తీవ్రమైన నేరాన్ని చేశాడన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. తన రాజ్యంలో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.

బన్నీ అరెస్టుతో రేవంత్ సర్కారు ఇచ్చిన సంకేతం ఏమిటన్నది చూస్తే.. తమకు వ్యక్తి.. అతడికి ఉండే భారీ ఇమేజ్.. రాజకీయ పలుకుబడి.. ఇతరత్రా అంశాలేమీ వర్కువుట్ కావని తప్పు చేస్తే శిక్షలు తప్పవన్న భయాన్ని ఇచ్చేసిందని చెప్పాలి. రంగం ఏమైనా కావొచ్చు.. రేవంత్ సర్కారుతో స్నేహం లేకపోవచ్చు కానీ వైరం మాత్రం పెట్టుకోకూడదన్న చర్చ బలంగా వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రేవంత్ సర్కారు ఇమేజ్ ‘పుష్ప’ దెబ్బకు అమాంతం పెరిగిందన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోక తప్పదు.

Tags:    

Similar News