పవన్ ని ఓడించిన నేత పార్టీ (జనసేనలోకి) మారబోతున్నారా?

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు అన్నస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక మూల ఆసక్తికర పరిణామాలు జరుగుతుంటాయి

Update: 2024-10-27 05:51 GMT

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు అన్నస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక మూల ఆసక్తికర పరిణామాలు జరుగుతుంటాయి. నాయకుల్లో ఉన్న ఉత్సాహమో.. ప్రజల్లో రాజకీయాలపై ఉన్న శ్రద్ధాశక్తులో తెలియదు కానీ.. ఏపీ రాజకీయాలు నిత్యం హాట్ టాపిక్ గా ఉంటుంటాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భీమవరం నియోజకవర్గంలో జరిగిన త్రిముఖ పోరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై 8,357 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం బలంగా జరుగుతుంది. తాజాగా ఆ ప్రచారానికి బలంచేకూర్చే ఘటన తెరపైకి వచ్చింది.

అవును... 2024 ఎన్నికల ప్రచారం సమ్యంలో... పవన్ కల్యాణ్ రీల్ హీరో అయితే, శ్రీను రియల్ హీరో అంటు జగన్ పైకి లేపిన మాజీ ఎమ్మెల్యే వైసీపీకి బై బై చెప్పబోతున్నారని అంటున్నారు. ఈ ప్రచారం తెరపైకి రావడానికి పలు బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు భీమవరంలో ప్రజానికం!

ఇందులో భాగంగా... 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం గ్రంధి శ్రీను పార్టీ కార్యక్రమాలకు దురంగా ఉంటున్నారని.. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు మాజీ మంత్రులు సైతం ఆయన ఇంటికి వెళ్లారని చెబుతున్నారు. అయినప్పటికీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి కూడా గ్రంధి శ్రీను గైర్హాజరయ్యారని చెబుతున్నారు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలన్నింటీ బేరీజు వేసుకున్న ప్రజానికం.. ఆయన పార్టీ మార్పుపై ఒక క్లారిటీకి వచ్చేశారని చెబుతున్నారు.

జనసేన వైపు చూస్తున్నారా?:

భీమవరం నియోజకవర్గంలో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... భీమవరం మాజీ ఎమ్మెల్యే, 2019లో పవన్ ని ఓడించిన వైసీపీ నేత అయిన గ్రంధి శ్రీను.. జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఆయనపై ఓ వర్గం ప్రజానికం నుంచి ఒత్తిడి ఉందని అంటున్నారు.

దీంతో.. ఈ విషయం హాట్ గాసిప్ గా మారింది! పైన చెప్పుకున్న విషయం నిజమే అయితే.. గ్రంధి శ్రీను ఫ్యాన్ కింద నుంచి లేచి గాజు క్లాసు పట్టుకోవడానికి సిద్ధపడితే.. అందుకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒప్పుకుంటారా అనేది పెద్ద ప్రశ్నగా ఉందని మరికొంతమంది అంటున్నారు.

ఏది ఏమైనా... తన మౌనానికి గల కారణం, ఫలితాల అనంతరం లో-ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి దారితీసిన పరిస్థితుల గురించి గ్రంధి శ్రీను నోరు విప్పాల్సి ఉంది! అలాకానిపక్షంలో... ఈ ఊహాగాణాలే వాస్తవాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు నమ్మే అవకాశం ఉందని అంటున్నారు!

Tags:    

Similar News