నడిరోడ్డుపై ఆటో డ్రైవర్ దారుణ హత్య... షాకింగ్ వీడియో!

హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్యకు గురయ్యాడు.

Update: 2025-01-22 12:19 GMT

హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్యకు గురయ్యాడు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా.. ప్రజలంతా చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో షాకింగ్ గా ఉంది. పట్టపగలు ఇలా నడిరోడ్డుపై హత్య జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అవును... హన్మకొండలో అత్యంత దారుణం చోటు చేసుకూంది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా మణికొండకు చెందిన ఆటో డ్రైవర్లు రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు కత్తులతో దాడి చేసుకున్నారు. వీరిలో రాజ్ కుమార్ అనే డ్రైవర్ మృతి చెందాడు. ఈ సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు విచారణ చేపట్టారు.

అనంతరం ఆటో డ్రైవర్ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే.. ఆ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తున్న సమయంలో చుట్టుపక్కల జనాలు చాలా మంది భయాందోళనలు చెందగా.. మరికొంతమంది ఏమి జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా ఉండిపోయారని.. ఇంకొంతమంది సెల్ ఫోన్స్ తో వీడియోలు తీశారని అంటున్నారు.

రాజ్ కుమార్ ఆటోలో ఉండగా.. అక్కడకు చేరుకున్న వెంకటేశ్వర్లు.. తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశాడని చెబుతున్నారు. ఈ సమయంలో రాజ్ కుమార్ కడుపులో సుమారు 15 సార్లు కత్తితో పొడిచాడని అంటున్నారు. దీంతో... రాజ్ కుమార్ సృహతప్పి పడి పోయాడు.

ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదని చెబుతున్నారు. అయితే... ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణం అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తూ ఈ హత్యకు దారి తీసిందని తెలుస్తోంది.

Tags:    

Similar News