టార్గెట్ పీకే : .హరీష్ హాట్ కామెంట్స్ ఎందుకంటే...?
పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ఇంకా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన నరేంద్ర మోడీతో కలసి బీసీల ఆత్మ గౌరవ సభకు హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ఇంకా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన నరేంద్ర మోడీతో కలసి బీసీల ఆత్మ గౌరవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడింది కూడా ఎక్కువగా ప్రధాని మోడీ గురించే. తెలంగాణా రాష్ట్రం సాధించిన తరువాత ఇంకా సాధించాల్సింది చాలా ఎక్కువగా ఉందని మాత్రం అన్నారు
టోటల్ గా చూస్తే కేసీయార్ ప్రభుత్వం గురించి పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడింది లేదు. అయితే ఎందుకైనా మంచిదేమో అని అనుకున్నారో లేక బీజేపీతో కలసి పవన్ జతకట్టారని భావించారో తెలియదు కానీ పీకే ఏమీ చేయలేరని ఒక పవర్ ఫుల్ డైలాగ్ ని మంత్రి హరీష్ రావు వాడేశారు.
కేఈయార్ ని ఎవరూ ఏమీ చేయలేరని మరోసారి ఆయనే సీఎం అని హరీష్ రావు అంటూ పవన్ కళ్యాణ్ అలియాస్ పీకే వల్ల ఏమీ కాదని అన్నారు. తెలంగాణాకు కేసీయార్ ఏకే 47 లాంటి వారని, ఆయన్ని పీకేలు, డీకేలు ఏమీ చేయలేరని ప్రాసతో కూడిన డైలాగులను హరీష్ రావు వాడారు.
ఇక్కడ డీకే అంటే డీకే శివకుమార్ అని అర్ధమన్న మాట. ఆయన కర్నాటక డిప్యూటీ సీఎం గా ఉంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాలలో పాలు పంచుకుంటున్నారు. మరో వైపు చూస్తే రాష్ట్రలో తెలంగాణా ద్రోహులు అంతా ఏకమవుతున్నారని కూడా హరీష్ హాటు కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల మీద ఆయన డైరెక్ట్ గా ఈ కామెంట్స్ చేశారన్న మాట. బీజేపీకి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ కి వైఎస్ షర్మిల మద్దతు ఇవ్వడాన్ని హరీష్ రావు ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు. ఇక కేసీయార్ మీద పోటీ అంటూ కొందరు చెప్పుకుంటూ జబ్బలు చరచుకుంటున్నారని ఆయన ఈటెల రాజెందర్ తో పాటు రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేశారు.
వారిది మేకపోతు గాంభీర్యం అయితే అసలైన విజయం మాత్రం కేసీయార్ దే అని అంటున్నారు. అంతే కాదు పెద్ద వారితో పోటీ పడితే తామూ పెద్ద వారు కావచ్చు అని భావిస్తున్నారని కూడా సెటైర్లు పేల్చారు. వేయి మాటలేల ఒక్క మాట చాలు అన్నట్లుగా తెలంగాణా సమాజం మొత్తం మీద కేసీయార్ సరిసాటి నాయకుడు వేరొకరు లేనేలేరని కూడా హరీష్ రావు చెప్పేసారు.
ఎంతో కష్టపడి తెలంగాణాను కేసీయార్ సాధించారని, అలాగే గడచిన తొమ్మిదిన్నరేళ్ళ కాలంలో అభివృద్ధి చేశారని కూడా హరీష్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే పీకే ఏమీ చేయలేరు అని ఎందుకు డైలాగు కొట్టినట్లు అన్నదే చర్చ. అంటే పవన్ లో కసి రేపి వ్యతిరేక ఓట్లలో చీలిక తెచ్చేలా చూడడానికేనా అన్నదే సందేహంగా ఉంది అని అంటున్నారు.