జైలు వ్యానులోనే అంత పని చేశారా?
దేశంలో హత్యలు, అత్యాచారాలకు కొదవేలేదు. వాటికి పాల్పడే వారికి శిక్షలు కూడా నామమాత్రమే
దేశంలో హత్యలు, అత్యాచారాలకు కొదవేలేదు. వాటికి పాల్పడే వారికి శిక్షలు కూడా నామమాత్రమే. దీంతో చట్టాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. దీంతో నేరం చేసిన వారికి కూడా శిక్షలు అంతంత మాత్రంగానే పడుతుండటంతో నేరాలు చేయడానికి వెనకాడటం లేదు.
ఈనేపథ్యంలో హర్యానాలో ఓ మహిళా ఖైదీపై ఇద్దరు పురుష ఖైదీలు అత్యాచారానికి పాల్పడటం సంచలనం కలిగించింది. రోహ్ తక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ, ఇద్దరు పురుష ఖైదీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపిస్తుండగా వ్యానులోనే ఇద్దరు పురుషులు ఆమెపై అత్యాచారం చేశారు. విషయం ఆమె పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేశారు.
ఖైదీలను తరలించేందుకు వ్యాన్ ఏర్పాటు చేసిన జైలు సిబ్బంది వారిని అందులో ఎక్కించారు. పోలీసులు డాక్యుమెంట్ వర్క్ చేస్తుండగా ఇద్దరు ఖైదీలు ఆమెపై అత్యాచారం చేయడం గమనార్హం. ఇలా ఓ మహిళా ఖైదీపై అత్యాచారం చేయడం సంచలనం రేపుతోంది. నిందితులు మహిళా ఖైదీపై లైంగిక దాడి జరపడంతో ఇదివరకే వారికి ఉన్న శిక్ష రెట్టింపవుతుందా? అని ఆలోచిస్తున్నారు.
నిర్భయ, దిశ లాంటి చట్టాలున్నా రెచ్చిపోతున్నారు. దొరికిందే చాన్స్ అనుకుని పశువుల్లా ప్రదర్శిస్తున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరు ఖైదీలు మహిళా ఖైదీపై అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వారు చేసిన పనికి ఎంతదూరం వెళ్తుందో చూడాలి మరి. ఈనేపథ్యంలో ఈ వ్యవహారం ఎంత దారుణానికి కారణమవుతుందో తెలియడం లేదు.
హర్యానాలో చోటుచేసుకున్న ఉదంతంపై ఆగ్రహాలు పెరుగుతున్నాయి. మహిళా ఖైదీపై పురుష ఖైదీలు అత్యాచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు వారిద్దరిపై ఏ శిక్షలు విధిస్తారో చూడాల్సిందే. మహిళా ఖైదీపై దారుణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.