నీట మునిగిన కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ కొత్తపేటలో ఉన్న కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయం మునిగిపోయింది.

Update: 2024-09-02 05:27 GMT

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ కొత్తపేటలో ఉన్న కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయం మునిగిపోయింది. దీంతో ఆ సంస్థకు రూ.70 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక్కడ పాల సేకరణతో పాటు, పాల ఉత్పత్తులు కూడా తయారు చేస్తారు. బుడమేరు కాల్వ ఉప్పొంగడంతో ఫ్యాక్టరీలోకి ఐదు అడుగుల మేర నీరు చేరింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, జనరేటర్లు పనిచేయక పోవడంతో అక్కడ యంత్రాలు పనిచేయక భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఇక్కడకు రావాల్సిన పాలను బాపులపాడు మండలం వీరవల్లిలో నిర్మించిన కొత్త ప్లాంటుకు మళ్లించారు.

విజయవాడలో నీట మునిగిన హోంమంత్రి నివాసం

విజయవాడలోని రామవరప్పాడు వంతెన కింద ఉన్న కాలనీ నీట మునిగింది. ఆ ప్రాంతంలోనే ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత నివాసాన్ని కూడా వరదలు చుట్టుముట్టాయి. దీంతో ఆమె తన పిల్లలను ఓ ట్రాక్టర్ లో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాలనీ మొత్తం జలదిగ్భంధంలో చిక్కుకుపోవడంతో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక చర్యలను పర్యవేక్షించారు. బుడమేరు ముంపు ప్రాంతాలను రాత్రంతా పర్యవేక్షిస్తూ దగ్గరుండి ప్రజలకు ఆహారం పంపిణీ చేశారు.

Tags:    

Similar News