బిగ్ బ్రేకింగ్... ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష!
ఈ సమయంలో ముంబై కోర్టు షాకిచ్చింది.. మూడు నెలల జైలు శిక్ష విధించింది.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఓ షాకింగ్ విషయం బ్రేకింగ్ అయ్యింది. ఆయన ఇటీవల ఏపీలో కేసులు, అరెస్టుల ఎపిసోడ్స్ అత్యంత రసవత్తరంగా మారగా.. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుని కాస్త రిలాక్స్ గా ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో ముంబై కోర్టు షాకిచ్చింది.. మూడు నెలల జైలు శిక్ష విధించింది.
అవును... చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. సుమారు గత ఏడేళ్లుగా విచారణ జరుపుతున్న వ్యవహారంపై అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నిర్ణయంం తీసుకుంది. ఈ తీర్పు వినిపించే సమయంలో రామ్ గోపాల్ వర్మ హోర్టుకు హాజరుకాలేదని అంటున్నారు.
ఇలా మేజిస్ట్రేట్ తీర్పు రోజున నిందితుడు గైర్హాజరైనందుకు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నెగోషియబుల్ ఇనిస్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ - 138 ప్రకారం ఆర్జీవీకి శిక్ష పడిందని తెలుస్తోంది.
ఇదే సమయంలో... మూడు నెలల్లోగా ఫిర్యాదు దారుడికి రూ.3,72,219 నష్టపరిహాం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నష్ట పరిహారం చెల్లించడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా... మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన మేజిస్ట్రేట్ వైపీ పూజారి... విచారణ సమయంలో కస్టడీలో ఎక్కువ సమయం గడపనందున.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 428 ప్రకారం వర్మ శిక్ష తగ్గింపును పొందలేరని పేర్కొన్నారు.
కాగా... ఈ కేసులో జూన్ 2022లో రామ్ గోపాల్ వర్మకు ష్యూరిటీ, రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ పై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తీర్పు వెల్లడించింది.