శుక్రవారం రాష్ట్రానికి సీఎం జగన్... నెక్స్ట్ పని ఇదేనా?
ఈ క్రమంలో సీఎం జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని రేపు రాష్ట్రానికి రానున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సుమారు రెండునెలల పాటు అవిశ్రాంతంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడిపిన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్.. పోలింగ్ అనంతరం ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సతీసమేతంగా లండన్ వెళ్లారు. ఈ క్రమంలో సీఎం జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని రేపు రాష్ట్రానికి రానున్నారు.
అవును... పోలింగ్ అనంతరం ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఇవాళ రాత్రి లండన్ నుండి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ క్రమంలో రేపు (శుక్రవారం) ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోని, అక్కడ నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి వెళ్లనున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈ నెల 17న సీబీఐ కోర్టు అనుమతితో కుటుంబ సభ్యులతో కలిసి లండన్ కు వెళ్లారు జగన్. ఈ క్రమంలో లండన్ నుండి యూరప్ లోని కొన్ని దేశాలలో కూడా పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమారు రెండు వారాలకు పైగా ఆయన భార్య, పిల్లలతో విదేశాల్లో గడిపారు! ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
ఇలా శుక్రవారం నేరుగా రాష్ట్రానికి రానున్న జగన్... అనంతరం కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలుకువలపై పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క తాజాగా ట్వీట్ చేసిన జగన్... ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు.
కాగా నిన్నటి రోజునే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన విదేశీ పర్యటన ముగించుకోని ఆయన నివాసం ఉండే హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసాని చేరుకున్నారు! అయితే... ఆయన ఏ దేశం నుండి వచ్చారనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు!