మద్యం తాగి వేధించిన డ్రైవర్.. చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె

అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత గురించి ఇదంతా. అసోం గణ పరిషత్ (ఏజీపీ) పార్టీతో దేశ రాజకీయాల్లో ప్రపుల్ల చాలా పాపులర్.;

Update: 2025-03-04 05:55 GMT

ఈశాన్య రాష్ట్రంలో ఆయన అత్యంత చిన్న వయసులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగారు.. విద్యార్థి రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి అయ్యారు.. సొంతంగా పార్టీని స్థాపించి ఓ దశలో జాతీయ రాజకీయాల్లోనూ ప్రముఖుడిగా నిలిచారు. మూడు, నాలుగు దశాబ్దాల కిందట ఆయన ఓ సంచలనం.. ఇప్పుడు కనీసం శాసనసభ్యుడిగా కూడా లేరు.. కానీ, ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను వాడుకునేందుకు అనుమతిచ్చింది.

అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత గురించి ఇదంతా. అసోం గణ పరిషత్ (ఏజీపీ) పార్టీతో దేశ రాజకీయాల్లో ప్రపుల్ల చాలా పాపులర్. రాజకీయంగా ప్రస్తుతం ఆయన వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా సీఎం హిమంత బిశ్వ శర్మ హవా మొదలయ్యాక ప్రఫుల్ల పలుకుబడి తగ్గింది.

తాజాగా డ్రైవర్‌ మద్యం మత్తులో దూషించాడంటూ మహంత కుమార్తె తమ డ్రైవర్‌పైనే విరుచుకుపడ్డారు. అంతేకాక అతడిని చెప్పుతో కొట్టారు. ఇదంతా ఎమ్మెల్యే క్వార్టర్లలోనే జరిగింది. ఈ మేరకు వీడియో వైరల్‌ గా మారింది. తమ వద్ద చాలాకాలంగా పనిచేస్తున్న ఈ డ్రైవర్‌ నిత్యం మద్యం తాగి దుర్భాషలాడుతూ, వేధిస్తున్నాడని ప్రఫుల్ల కుమార్తె చెప్పారు. అతడికి ఉన్న ఆరోగ్య సమస్య కారణంగా అలా ప్రవర్తిస్తున్నాడని.. ఓపిక పట్టామని, ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి మార్పూ రాలేదని తెలిపారు.

ఇంట్లో ఉండగా తలుపును గట్టిగా బాదుతూ.. బయటకు రమ్మని దూషించాడని అందుకే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పానని పేర్కొన్నారు.

Tags:    

Similar News