వంద శాతం ప్రధాని పదవి రేసులో ఉన్నా.. కేసీఆర్
ఇప్పుడు మళ్లీ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతానని ప్రతిన బూనుతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లు సీఎంగా పనిచేశారు. పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ చేతిలోకి వెళ్లింది. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ రాజకీయాలను శాసిస్తానని కంకణం కట్టుకున్నారు. కానీ చివరకు రాష్ట్రంలోనే ఓటమి పాలయ్యారు.
ఇప్పుడు మళ్లీ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతానని ప్రతిన బూనుతున్నారు. అవకాశం వస్తే ప్రధాని రేసులో తాను ఉంటానని చెబుతున్నారు. ఆశకైనా ఓ అంతు ఉండాలి. రాష్ర్ట్రంలోనే రెండంకెల సీట్లు రావడం కష్టంగా ఉన్న ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తానని చెప్పడం వింతగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
పట్టుమని మీ పార్టీకి పది సీట్లయినా వచ్చే అవకాశం లేదు. ఒకటి రెండు వస్తే ఎక్కువ అంటున్నారు. ఈనేపథ్యంలో తాను కూడా ప్రధాని రేసులో ఉన్నానని చెప్పడం దేనికి సంకేతం అంటున్నారు. పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టండి అన్నట్లు గా ఉందంటున్నారు. కేసీఆర్ మానసిక స్థితి దెబ్బ తిందని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.
గతంలోనే జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తానని బయలుదేరి చేయి కాల్చుకుని మరీ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంతోనే ముచ్చి కాలం దాపురించిందని అంటున్నారు. ఇప్పుడు ప్రధాని పదవి రేసులో తాను కూడా ఉన్నానని చెప్పడంతో అందరు కంగుతింటున్నారు.
ఏం చూసుకుని కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారు. ఏ ధైర్యంతో ప్రధాని రేసులో ఉంటున్నానని చెబుతున్నారు. కేసీఆర్ మాటలకు అర్థమేమిటి? ఆధారాలేమిటి? ఇండియా కూటమిలో భాగస్వామి కూడా కాలేదు. కానీ ప్రధాని పదవి ఆశిస్తున్నట్లు చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి. విషయం ఎందాకా వెళ్తుందో ఆగాలి.