పెళ్లి కానుకలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

తద్వారా వరకట్న ఆరోపణలు ఉండవని అభిప్రాయపడింది!

Update: 2024-05-16 07:47 GMT

పెళ్లిలో స్వీకరించే కానుకులకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... వరకట్న నిషేధ చట్టం, 1961లోని సెక్షన్ 3(2) ప్రకారం వివాహ సమయంలో వధువు లేదా వరుడు స్వీకరించిన బహుమతులకు సంబంధించి జాబితాను నిర్వహించడం చాలా ముఖ్యం అని పేర్కొంది. తద్వారా వరకట్న ఆరోపణలు ఉండవని అభిప్రాయపడింది!

అవును... అలహాబాద్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో... వరకట్న నిషేధ చట్టం, 1961 నుండి ఉత్పన్నమయ్యే అనేక వ్యాజ్యాలు కోర్టులో వస్తున్నాయని.. తద్వారా వివాహ సమయంలో వధువు లేదా వరుడు అందుకున్న బహుమతుల జాబితాను నిర్వహించడం చాలా ముఖ్యం అని పేర్కొంది. ఫలితంగా వరకట్న తప్పుడు కేసులను నిరోధించేందుకు ఇది సహకరిస్తుందని వెల్లడించింది.

న్యాయమూర్తి విక్రమ్ డి. చౌహాన్‌ తో కూడిన ధర్మాసనం... చట్టంలోని పైన పేర్కొన్న నిబంధన ప్రకారం, కట్నం డిమాండ్ లేకుండా వివాహ సమయంలో ఇచ్చే బహుమతులను జాబితాలో నమోదు చేయవలసి ఉంటుందని.. ఆ జాబితాను తప్పనిసరిగా నమోదు చేస్తూ దానిపై వధువు, వరుడు ఇద్దరూ సంతకం చేయాలని సూచించింది!

కాగా... చట్ట ప్రకారం వరకట్నం ఇవ్వడం లేదా తీసుకున్నా 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, రూ. 15000 కంటే తక్కువ జరిమానా లేదా కట్నం విలువకు సమానమైన మొత్తం, ఏది ఎక్కువైతే అది జరిమానాలను అందిస్తుంది. ఇదే సమయంలో... అదే చట్టంలోని సెక్షన్ 3 (2) ప్రకారం, వధువు వివాహ సమయంలో వరుడి తరపునుంచి ఎటువంటి డిమాండ్ లేకుండా కట్నం తీసుకుంటే పెనాల్టీ వర్తించదు!

Tags:    

Similar News