హైఎండ్ బ్రోతల్ నెట్ వర్క్... పొలిటీషియన్స్ కు, పెద్దలకూ మాత్రమే!
అవును... 2020 నుండి రన్నింగ్ లో ఉన్నట్లు చెబుతున్న హై-ఎండ్ బ్రోతల్ నెట్ వర్క్ ను నిర్వాహకులనే ఆరోపణలతో అమెరికాలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
సాధారణంగా అడల్ట్ సర్టిఫైడ్ సినిమాలకు బయట పోస్టర్లలో "పెద్దలకు మాత్రమే" అని ఒక హెచ్చరిక నోట్ కనిపిస్తుంటుంది. తాజాగా అమెరికాలో పట్టుబడ్డ హై ఎండ్ బ్రోతల్ నెట్ వర్క్ కూడా అలా పెద్దలకు మాత్రమే! కాకపోతే.. ఆ పెద్దరికం వయసులో కాదు సుమా... డబ్బులో, హోదాలో అన్నమాట! తాజాగా ఇలాంటి వ్యవహారం తెరపైకి వచ్చింది. ముగ్గురు అరెస్ట్ అయ్యారు. పొలిటీషియన్స్ పేర్లు బయటకు రాలేదు ప్రస్తుతానికి!
అవును... 2020 నుండి రన్నింగ్ లో ఉన్నట్లు చెబుతున్న హై-ఎండ్ బ్రోతల్ నెట్ వర్క్ ను నిర్వాహకులనే ఆరోపణలతో అమెరికాలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ నెట్ వర్క్ కస్టమర్లలో ప్రధానంగా ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు సైనిక అధికారులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఇది బాగా హైఎండ్ వ్యవహారం అని క్లారిటీకి వస్తున్నారు అధికారులు.
ఈ క్రమంలో... పక్కా సమాచారం మేరకు మసాచుసెట్స్ లోని కేంబ్రిడ్జ్, వాటర్ టౌన్, వాషింగ్టన్ వెలుపల వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్ లో బహుళ వ్యభిచార గృహాలను కలిగి ఉన్న అంతర్రాష్ట్ర వ్యభిచార నెట్ వర్క్ ను నిర్వహిస్తున్నందుకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి పేర్లు హాన్ లీ (41), జేమ్స్ లీ (68), జున్మ్యూంగ్ లీ (30) అని తెలుస్తుంది!!
బోస్టన్, తూర్పు వర్జీనియాలోని మహిళలతో అపాయింట్‌మెంట్ లను అందించే రెండు వెబ్ సైట్లలో వ్యభిచార నెట్ వర్క్ గురించి నిందితుడు ప్రచారం చేశాడట. ఈ వెబ్ సైట్ లో నగ్న, అర్ధనగ్న ఫోటోలతో పాటు ప్రతి మహిళ ఎత్తు, బరువు మొదలైన సైజుల వివరాలను వివరిస్తూ పొందుపరిచారంట. ఇదే సమయంలో మహిళ ఎంపికలో రకరకాల ఫిల్టర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు.
ఈ సమయంలో క్లయింట్ లు కొనసాగడానికి ముందు వెరిఫికేషన్ ప్రక్రియలో వెబ్ సైట్ లలో వారి పేర్లు, ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ తోపాటు ఒక అప్లికేషన్ ను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందట. ఫోన్ ద్వారా వేశ్యాగృహంతో కన్ ఫర్మేషన్ తర్వాత "టార్గెట్ లొకేషన్స్" లేదా హై-ఎండ్ అపార్ట్‌మెంట్ లుగా వర్ణించబడిన వివిధ ప్రదేశాలలో కలవడానికి అంగీకారం కుదురుతుందట.
ఇదే సమయంలో ఈ వ్యభిచార గృహం అందించే సేవల ధరల వివరాలు గంటకు $350 నుండి $600 వరకు ఉంటుందని చెబుతున్నారు. అలా ఇప్పటికే ఈ హై ఎండ్ బ్రోతల్ నెట్ వర్క్ లో సభ్యులుగా పలువురు రాజకీయ నాయకులు, ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్ లు, డాక్టర్లు, మిలిటరీ అధికారులు, సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ప్రొఫెసర్లు, లాయర్లు, మొదలైనవారితోపాటు పలువురు విద్యార్థులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు! ప్రస్తుతం ఈ వ్యవహారం అగ్రరాజ్యంలో హాట్ టాపిక్ గా మారిందని చెబుతున్నారు.