70 ఏళ్లుగా దీపావళికి దూరం... ఏమిటీ ఆ ఊరుకి ఉన్న శాపం?

చీకటిని పారదోలి వెలుగులు నింపే దీపావళి పండుగను యావత్ దేశం ఘనంగా చేసుకుంటోంది.

Update: 2024-11-01 04:21 GMT

చీకటిని పారదోలి వెలుగులు నింపే దీపావళి పండుగను యావత్ దేశం ఘనంగా చేసుకుంటోంది. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసులు కూడా నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ లో స్కూల్స్ కి పబ్లిక్ హాలిడే కూడా ప్రకటించి మరీ పండగ చేసుకోమన్నారు! అయితే.. ఓ ఊరు మాత్రం దీపావళికి చాలా కాలంగా దూరం.. దానికి కారణం ఆ ఊరికున్న శాపమట!

అవును... దీపావళి పండగ అంటే దీపాల వెలుగులు, బాణసంచా పేలుళ్లతో భారీ ఎత్తున సందడి నెలకొంటుందనేది తెలిసిన విషయమే. భారతదేశంలో నలుమూలలా దీపాల వెలుగులు, టపసుల చప్పుళ్లూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని ఓ ఊరు మాత్రం ఈ సందడికి చాలా దూరం.. చాలా కాలంగా దూరం. అందుకు ఓ బలమైన కారణం, శాపం ఉన్నాయని చెబుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ జిల్లా సమ్మూ గ్రామానికి చెందిన ఓ మహిళ.. దీపావళి పండగ కోసం పుట్టింటికి బయలుదేరిందంట. ఆ సమయంలో తన భర్త చనిపోయాడనే మరణవార్త వచ్చిందంట. అయితే.. అప్పటికే గర్భిణిగా ఉన్న ఆ మహిళ.. ఆ వార్తతో ఒక్కసారిగా షాక్ కి గురై, ఆ బాధను భరించలేక, భర్త చితిపై పడి ఆత్మార్పణం చేసుకుందట.

ఇదే సమయంలో.. ఆ ఊరి ప్రజలు ఎన్నడూ దీపావళి పండగ జరుపుకోవద్దని శాపం పెట్టిందంట. దీంతో.. అప్పటి నుంచి ఆ ఊరిలో దీపావళి నాడు దీపాల కాంతి, టపాసుల చప్పులు, క్రాకర్స్ మెరుపులు ఉండవని చెబుతున్నారు. అయితే... ఇక్కడ యువత మాత్రం ఊరిలో ఏదో ఒకరోజు దీపావళి జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు!

ఏపీలోనూ ఉందో గ్రామం!:

హిమాచల్ ప్రదేశ్ తరహాలోనే ఏపీలోనూ అలా దీపావళికి దూరంగా ఉంటున్న ఊరు ఒకటి ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు దశాబ్ధాలుగా ఈ ఊరు దీపావళికి దూరంగా ఉంటోంది. అనకాపల్లి జిల్లాలో 450 ఇళ్లు, 1,500 జనాభా ఉన్న కిత్తంపేట అనె శివారు గ్రామ కూడా దీపావళికి దూరంగా ఉంటుంది.

దీనికీ ఓ బలమైన కారణం ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. సుమారు 70 ఏళ్ల కిందట దీపావళి రోజున దివిటీలు తిప్పుతుండగా నిప్పురవ్వలు పడి పాకలు, గడ్డివాములు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు అన్నీ కలిపోయాయంట. ఇలా మూగజీవాలు మృత్యువాత పడినప్పటి నుంచీ అన్నీ అపశకునాలే జరిగాయంట.

దానికి తోడు దీపావళి పండుగ నాడు ఊరికో మరణాలు కూడా ఎక్కువగా జరిగేవంట. దీంతో... ఇకపై దీపావళి పండుగను జరుపుకోకూడదని నాటి పెద్దలు నిర్ణయించారంట. దీంతో.. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. అయితే... నాగులచవితి రోజున పుట్టలో పాలు పోసి టపాసులు కాలుస్తారు!

Tags:    

Similar News