ఎలన్ మస్క్ X(ట్విటర్‌) పై భారీ సైబర్ దాడి.. చేసింది ఎవరో తెలుసా?

ఇది ముఖ్యమైన సమాచార వనరు అయినందున దాని పనితీరు చాలా మందిపైన ప్రభావం చూపించింది..;

Update: 2025-03-11 04:26 GMT

X (మాజీ ట్విటర్) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించబడుతున్న సోషల్ మీడియా వేదికలలో ఒకటి. ఇది ముఖ్యమైన సమాచార వనరు అయినందున దాని పనితీరు చాలా మందిపైన ప్రభావం చూపించింది..

అయితే ఈ సోషల్ మీడియా దిగ్గజం పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు వారి ఖాతాలను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. తొలుత ఇది వ్యక్తిగత సమస్యగా భావించారు. కానీ తర్వాత ఎలాన్ మస్క్ దీనిని ఒక భారీ సైబర్ దాడిగా ప్రకటించారు.

ట్విటర్ అవుటేజ్ గురించి మస్క్ మాట్లాడుతూ "Xపై భారీ సైబర్ దాడి జరిగింది. ఇంకా కొనసాగుతోంది. మాకు ప్రతిరోజూ దాడులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగింది. దీని వెనుక పెద్ద గ్రూపు లేదా ఏదైనా దేశం ఉండే అవకాశం ఉంది. మేము ట్రేస్ చేస్తున్నాం." అని తెలిపారు.

దాడి గురించి మస్క్ మరిన్ని వివరాలను వెల్లడించలేదు. అయితే సేవలు నెమ్మదిగా పునరుద్ధరించబడుతున్నాయి, చాలా మంది యూజర్లు మళ్లీ ప్లాట్‌ఫారమ్‌ను సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు.

ట్విట్టర్ పై దాడి చేసింది ఎవరంటే?

ప్రపంచవ్యాప్తంగా X (ట్విటర్) సేవల్లో అంతరాయానికి తామే కారణమని హ్యాకింగ్ గ్రూప్ 'Dark Storm Team' ప్రకటించింది. ఈ సైబర్ దాడి వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకే చేసినట్లు వారు స్పష్టం చేశారు.

Dark Storm Team పాలస్తీనాకు అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రూప్ హై సెక్యూరిటీ సిస్టమ్లను సైతం సులభంగా హాక్ చేసే సామర్థ్యాన్ని కలిగినదని గుర్తింపు ఉంది. నాటో, ఇజ్రాయెల్, అలాగే దాని అనుకూల దేశాల వెబ్‌సైట్లను టార్గెట్ చేస్తుంటుంది.

Tags:    

Similar News