ఇక్కడ రివర్స్.. ముస్లిం దేశంలో పెరిగిన హిందువుల జనాభా!
2017లో పాకిస్థాన్ లో 35 లక్షల మంది హిందువులు ఉండగా ఈ సంక్య 2023 నాటికి 38 లక్షలకు పెరగడం గమనార్హం.
ప్రపంచంలో అత్యధికంగా ముస్లింలు ఉన్న రెండో దేశం.. భారత్. ఇండోనేసియాను మినహాయించి మిగతా ముస్లిం దేశాలను మించి భారత్ లోనే అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నారు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో హిందువులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే పూర్తిగా హిందూ దేశం.. అంతా అనుకుంటున్నట్టు భారత్ కాదు.. నేపాల్. నేపాల్ లో పూర్తిగా హిందువులు మాత్రమే ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, భూటాన్, అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్ లాండ్, ఇంగ్లండ్, సింగపూర్, ఫిజీ, కెనడా, మారిషస్ తదితర దేశాల్లో హిందువులు ఉన్నారు.
కాగా విదేశాల్లో ముఖ్యంగా మన శత్రు దేశం పాకిస్థాన్ లో హిందువుల జనాభా పెరుగుతుండటం విశేషం. మనదేశంలో హిందువులతో పోల్చితే ముస్లిం జనాభా పెరుగుతుంటే పాకిస్థాన్ లో మాత్రం రివర్స్ లో ఉంది. ఇక్కడ ముస్లింలతో పోల్చితే హిందువుల జనాభా పెరుగుతోంది.
2017లో పాకిస్థాన్ లో 35 లక్షల మంది హిందువులు ఉండగా ఈ సంక్య 2023 నాటికి 38 లక్షలకు పెరగడం గమనార్హం. మనదేశంలో ముస్లింలు మైనార్టీలుగా ఉండగా.. పాకిస్థాన్ లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు.
అయితే మైనార్టీలో అత్యధిక జనాభా హిందువులే. ఈ మేరకు గతేడాది పాకిస్థాన్ జనాభా లెక్కల్లో తేలింది.
ఇక మైనార్టీల్లో భాగంగా ఉన్న క్రై స్తవుల జనాభా 1.27 శాతం నుంచి 1.37 శాతానికి పెరిగింది. పాకిస్థాన్ లో 2017లో క్రైస్తవులు 26 లక్షల మంది ఉండగా వారి సంఖ్య 2023 నాటికి 33 లక్షలకు చేరింది. అహమ్మదీయుల వాటా 0.09 శాతం నుంచి 0.07 శాతానికి తగ్గింది.
అలాగే పాకిస్థాన్ లో సిక్కు మతస్తులు చాలా తక్కువ మందే ఉన్నారు. కేవలం 15,998 మందే సిక్కులు. అలాగే పార్సీలు 2,348 మంది మాత్రమే ఉన్నారు.
గతేడాది పాకిస్థాన్ మొత్తం జనాభా 24.4 కోట్లని వెల్లడయింది. ఈ మేరకు 7వ జనాభా, గృహగణన (2023) వివరాలను పాకిస్థాన్ జనాభా గణాంకాల విభాగం తాజాగా విడుదల చేసింది. 2050 నాటికి ప్రస్తుతం ఉన్న జనాభా 50 కోట్లకు చేరుకోనుందని తెలిపింది.
కాగా 2017 జనాభా లెక్కల ప్రకారం.. పాకిస్థాన్ జనాభాలో అత్యధికులు ముస్లింలే. మొత్తం జనాభాలో ముస్లింల వాటా 96.47 శాతం. అయితే ఇది 2023లో కొంత తగ్గి 96.35 శాతానికి పరిమితమైంది.