.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ప్రతీ నెలా ఏడు వేల పెన్షన్ కావాలి ?

సర్కారీ సొమ్ము ఎవరికైనా మజాగానే ఉంటుంది. ఇవ్వాలే కానీ కాదు అని ఎవరూ అన్నారు.

Update: 2024-07-01 13:30 GMT

సర్కారీ సొమ్ము ఎవరికైనా మజాగానే ఉంటుంది. ఇవ్వాలే కానీ కాదు అని ఎవరూ అన్నారు. పైగా కాసుల విషయంలో ఆశలే ఉంటాయి. ఇచ్చే వాడు ఉంటే చచ్చేవాడు కూడా లేస్తాడు అని సామెత కూడా ఉండనే ఉంది. దాంతో ఏపీలో సామాజిక పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారులు అంతా ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు.

ఎన్నడూ లేని విధంగా సామాజిక పెన్షన్లు జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు. అయితే ఇందులో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మధ్య మూడు నెలల పెంచిన వేయి రూపాయల మొత్తం ఎరియర్స్ ఉన్నాయి. దాంతో బంపర్ లాటరీ తగిలినట్లుగా ఎన్నడూ చూడని విధంగా ఒక నెలలోనే ఏడు వేల రూపాయల మొత్తాన్ని కళ్ళ చూశారు.

అది కూడా జూన్ నెలకు మూడు వేల రూపాయలు అంటే జూలైకి ఏడు వేల రూపాయలు. కేవలం ఒక్క నెల తేడాలో నాలుగు వేల రూపాయలు అలా కలసి వచ్చాయన్న మాట. దీంతో ప్రతీ సామాజిక పెన్షన్ లబ్దిదారుడూ ఏడు వేల రూపాయలను చూసి మురిసిపోతున్నారు.

ఇంత పెద్ద మొత్తం ప్రతీ నెలా ఇస్తే బాగుండని అని అనుకుంటున్నారు. ఎందుకంటే పెన్షన్ ఎపుడూ ఇంత స్థాయిలో ఒకేసారి అందుకోవడం జరగలేదు దాంతో డబ్బు ఎవరికైనా చేదు కాదు. చంద్రబాబు ప్రభుత్వం ఉదారంగా పెన్షన్ మొత్తాన్ని పెంచింది. అలా ఉదారత చూపించింది నాలుగు వేలకే ఎందుకు పరిమితం కావాలి అక్కడే ఎందుకు ఆగిపోవాలి అన్న చర్చ కూడా వారిలో ఉంది.

Read more!

ఏదో ప్రభుత్వ పెద్దలు దయతలచి ఏడు వేల రూపాయలతో మొదలెట్టారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే పోలా అన్న చర్చ కూదా వస్తోంది. అంటే ఒకేసారి మూడు వేల నుంచి ఏడు వేల రూపాయలకు అన్న మాట. ప్రస్తుతం పెన్షన్ దారుల మూడ్ అలా ఉంది. అయితే ఇది మూడు నెలల బకాయిలు కలుపుకుని మొత్తం అని తెలియక కాదు, కానీ నోట్లు అలా పెద్దవి కనిపిస్తూండడంతో ఈ సంబరం అలాగే కొనసాగితే బాగుంటుంది అన్న ఆలోచన వారిది.

ఏది ఏమైనా ఏడు వేల రూపాయలు ఒక నెలకు ఇచ్చి మరుసటి నెలకు నాలుగు వేలకే వెనక్కి లాగితే కిక్కి దిగిపోతుంది కదా అని అంటున్నారు. అందుకే ఏడుతోనే అడుగులు ముందుకు వేయాలని మనసారా కోరుకుంటున్నారు. అయితే ఏపీలో ఏడు వేల రూపాయల సామాజిక పెన్షన్ రావాలీ అంటే ఇంకా మరో అయిదు నుంచి పదేళ్ళు పడుతుంది అన్నది నగ్న సత్యం.

2014లో వేయి రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్ 2024లో నాలుగు వేలకు పెరిగింది. మధ్యలో పదేళ్ళు గడచాయి. మరి ఈ మొత్తం ఏడు వేలు కావాలంటే కనీసం మరో పదేళ్ళు అయినా పడుతుంది అని అంటున్నారు. వృద్ధుల కోసం ఏమీ ఆశ్రయం లేని వారి కోసం సామాజిక పెన్షన్లు ఇవ్వడం మంచిదే. అయితే ఆశలు పెడితే మాత్రం లబ్దిదారుల అంచనాలను చేరుకోవడం ఏ ప్రభుత్వం వల్లా కాదని అంటున్నారు. అది కాస్తా చివరికి అసంతృప్తికి దారి తీస్తే అసలుకే ఎసరు వచ్చిన వస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News