హురున్‌ రిచ్‌ లిస్ట్‌... తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది చోటు!

ఈ లిస్ట్ లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. అయితే ఈ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ 12 మంది బిలియానీర్లు ఉన్నారు.

Update: 2023-10-11 04:22 GMT

హురూన్ ఇండియా, 360 వన్ వెల్త్ సంయుక్తంగా "360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023" ని విడుదల చేసింది. భారత్‌ లోని అత్యంత ధనవంతుల 12వ వార్షిక రిపోర్ట్ ను కూడా వదిలింది. ఈ లిస్ట్ లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. అయితే ఈ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ 12 మంది బిలియానీర్లు ఉన్నారు.

అవును... ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా, దేశంలోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది "360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023" జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇందులో రూ.8.08 లక్షల కోట్లతో ముకేశ్ అంబానీ మొదటిస్థానంలో కొనసాగుతుండగా... రూ.4.74 లక్షల కోట్లతో అదానీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) అధిపతి సైరస్‌ పూనావాలా రూ.2.75 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉండగా... హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ రూ.2.28 లక్షల కోట్లతో నాలుగోస్థానంలో ఉన్నారు.

ఇక టాప్ - 10లో మిగిలిన ఆరు స్థానాల్లోనూ వరుసగా... గోపీచంద్‌ హిందూజా రూ.1.76, దిలీప్‌ సంఘ్వి రూ.1.64, లక్ష్మీ మిట్టల్ రూ.1.62, డీమార్డ్ దమానీ రూ.1.43, కుమార మంగళం బిర్లా రూ.1.25, నీరజ్‌ బజాజ్‌ రూ.1.20 లు నిలిచారు.

ఆ సంగతి అలా ఉంటే... "360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023" జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి 105 మంది చోటు దక్కించుకోగా.. ఇందులో అయిదుగురు మహిళలు! ఈ మొత్తం 105 మంది సంపద విలువ రూ.5.25 లక్షల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు.

ఇక వీరిలో దివీస్‌ మురళి రూ.55,700 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. మేఘా ఇంజినీరింగ్‌ కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అదే మేఘా ఇంజినీరింగ్ కు చెందిన పీవీ కృష్ణారెడ్డి రూ.35,800 కోట్లతో మూడోస్థానంలో ఉన్నారు. ఇక రూ.21,900 కోట్లతో హెటిరో ల్యాబ్స్ బి పార్ధసారధి రెడ్డి & ఫ్యామిలీ నాలుగోస్థానంలో ఉండగా... మైహోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర రావు & ఫ్యామిలీ రూ.17,500 కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్ జాబితాలో నలుగురు ఇండియన్స్ న్యూ ఎంట్రీ:

2023 ఏడాది ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 240.7 బిలయన్‌ డాలర్లతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం.. ఫ్రాన్స్ కు చెందిన లూయీస్ వీటన్ బ్రాండ్‌ ఫౌండర్‌, ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ జీన్ అర్నాల్ట్ ప్రంపంచలో టాప్‌ 2 ప్లేస్‌ లో ఉన్నారు. ఈయన సంపద 231.4 బిలియన్ డాలర్లు. కాగా... 154.9 బిలియన్ డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే ముఖేష్ అంబానీ గత 14ఏళ్లుగా ఇండియానుంచి ఈ జాబితాలో మొదటిస్థానంలో కొనసాగుతుండగా... తర్వాతి షానాల్లో గౌతమ్ అదానీ, సైరస్ పూనావాలా, శివ్ నాడార్, సావిత్రి జిందాల్ లు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఈ ఎలైట్ గ్రూపులో భారతీయ సంతతికి చెందిన ప్రముఖ బిలియనీర్లు తమదైన ముద్ర వేస్తున్నారు.

ఈ జాబితాలో... సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెడ్ ఎస్క్లైర్ సీఈఓ జే చౌదరి.. $9.2 బిలియన్ల నికర విలువ కలిగి ఉండగా... తర్వాతి స్థానంలో ఖోస్లా వెంచర్స్ వ్యవస్థాపకుడు.. వినోద్ ఖోస్లా $6.5 బిలియన్ సంపదను కలిగి ఉన్నారు. ఇదే సమయంలో తర్వాతి స్థానాల్లో వరుసగా... సింఫనీ ఏఐ చైర్మన్ రోమేష్ టి వాధ్వాని ఆస్తుల విలువ $5.1 బిలియన్లు కాగా... జిక్యూజీ పార్టనర్స్ వ్యవస్థాపకుడు రాజీవ్ జైన్ నికర విలువ $3.1 బిలియన్ గా ఉంది.

Tags:    

Similar News