సూటిగా సుత్తిలేకుండా... "ఇది ఓయో కాదు క్యాబ్"!
ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ లోని ఓ క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్ లో ప్రయాణించే వారికి ఆసక్తికరమైన వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల కాలంలో బహిరంగంగా రొమాన్స్ చేసుకోవడం.. పక్కన ఎవరున్నారు, అసలు మనం ఎక్కడున్నాం అనే సృహ కూడా లేకుండా 'కొన్ని' పనులు చేస్తుండటం ఎక్కువైపోయిందనే చర్చ బలంగా వినిపిస్తుంది! ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ లోని ఓ క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్ లో ప్రయాణించే వారికి ఆసక్తికరమైన వార్నింగ్ ఇచ్చారు.
అవును... ఇటీవల కాలంలో పబ్లిక్ ప్లేసెస్ లో రొమాన్స్ ఎక్కువైపోయిందని అంటున్నారు. పదిమంది ముందూ హగ్, కిస్ చేసుకోవడం, మరీ చనువుగా ప్రవర్తించడాన్ని పలువురు ఫ్యాషన్ గా, అప్ డేటెడ్ వెర్షన్ గా భావిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. ఓ క్యాబ్ డ్రైవర్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని పేపర్ పై ప్రింట్ తీసి కారులో ప్రదర్శించాడు.
ఇందులో భాగంగా... "వార్నింగ్!!... నో రొమాన్స్.. దిస్ ఈజ్ ఏ క్యాబ్.. ఇది మీ ప్రైవేట్ ప్లేస్ కాదు.. లేదా, ఓయో రూమ్ కాదు.. దూరంగా ఉండండి.. మౌనంగా ఉండండి" అని ఓ బోర్డును తన కారులో తగిలించాడు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
ఇందులో భాగంగా... "పాపం ఎన్ని దారుణాలు చూసి చూసి విసిగి చెంది ఈ బోర్డు పెట్టాడో!?" అని ఒకరు అంటుంటే... "ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు!" అని మరొకరు స్పందిస్తున్నారు. "సిటీ ట్రాఫిక్ లో ఏకాగ్రత దెబ్బతినడానికి అంతకు మించిన కారణం మరొకటి ఉంటుందా..?" మరొకరి స్పందన.
ఏది ఏమైనా... తాను చెప్పాలనుకున్న విషయన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పిన డ్రైవర్ ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. పక్కన ఎవరు ఉన్నారు అనే ఆలోచన లేకుండా.. అసభ్యంగా ప్రవర్తించే వారికి ఇది సరైన వార్నింగ్ అని కామెంట్ చేస్తున్నారు.