యూఎస్ లో ఇండియన్-అమెరికన్స్ హౌస్ హోల్డ్ ఇన్ కమ్ దూకుడు లెక్కలివే!

ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

Update: 2024-11-23 10:30 GMT

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు, భారతీయ-అమెరికన్ల దూకుడు చాలా విషయాల్లో కొనసాగుతుందనే చర్చ ఇటివల బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యంలోనూ తమకు పలు విషయాల్లో పోటీగా ఉన్న చైనాను వరుసగా ఒక్కొక్క విషయంలోనూ వెనక్కి నెడుతూ ముందుకుసాగుతోంది. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... అగ్రరాజ్యంలో దాదాపు అన్ని రంగాల్లోనూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తున్న భారతీయులు, అమెరికన్-భారతీయుల ఖాతాలో ఇటీవల వరుస రికార్డులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటికే అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో చైనాను వెనక్కి నెట్టిన భారత్.. ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో అమెరికాలోని హౌస్ హోల్డ్ ఇన్ కమ్ ర్యాంకింగ్స్ లో భారతీయ అమెరికన్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఈ మేరకు 2018 గణాంకాలు భారతీయ అమెరికన్ల సగటు వార్షియ ఆదాయాన్ని $119,858 గా వెళ్లడిస్తుండగా.. వైట్ అమెరికన్ల సగటు హౌస్ హోల్డ్ ఇన్ కమ్ $ 65,902 కంటే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ జాబితాలో తైవానీసి, జనపీస్, ఫిలిపినోస్, ఇండోనేషియన్స్ వంటి అగ్రశ్రేణి సంపాదన సమూహాలను కూడా భారతీయ అమెరికన్లు అధిగమించారు. ఇందులో భాగంగా... తైవానీస్ అమెరికన్స్ ($95,736).. చైనీస్ ($81,487).. జపనీస్ ($80,036).. పాకిస్థానీస్ ($77,315) తర్వత స్థానాల్లో ఉన్నారు.

అదేవిధంగా... 2019కి వచ్చేసరికి భారతీయ-అమెరికన్ల సగటు హౌస్ హోల్డ్ ఇన్ కమ్ $1,26,705 గా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో.. ఇంకా అధికారిక గణాంకాలు వెలువడనప్పటికీ 2024లో భారతీయ అమెరికన్ల ఆదాయం మరింత పెరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News