ఆ 40 లక్షల మంది భారతీయులే టార్గెట్‌!

ఈ నేపథ్యంలో అటు రిపబ్లికన్‌ పార్టీ, ఇటు డెమోక్రటిక్‌ పార్టీ అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్న భారతీయ అమెరికన్లపై కన్నేశాయి.

Update: 2024-09-05 15:30 GMT

ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఆ దేశ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అటు రిపబ్లికన్‌ పార్టీ, ఇటు డెమోక్రటిక్‌ పార్టీ అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్న భారతీయ అమెరికన్లపై కన్నేశాయి. వీరి ఓట్లను దక్కించుకోవడమే లక్ష్యంగా భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి.

ఈ నేపథ్యంలో రాబోయే అధ్యక్ష ఎన్నికలలో భారతీయ–అమెరికన్ల ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి ఇప్పటికే 'ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీ) ) 'ఇండో–అమెరికన్‌ ఓట్స్‌ మేటర్‌' ప్రచారాన్ని ప్రారంభించింది.

అమెరికా జనాభాలో దాదాపు 45 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ–అమెరికన్‌ ఓటర్లను నమోదు చేయడం, వారి అభిప్రాయాలను రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు తెలపడం ఎఫ్‌ఐఐడీ లక్ష్యం.

ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ ప్రక్రియలో భారతీయ–అమెరికన్‌ ప్రమేయాన్ని పెంచడం లక్ష్యంగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

భారతీయ–అమెరికన్లు అమెరికా మొత్తం జనాభాలో కేవలం 1.5% మాత్రమే ఉన్నారు. అయినప్పటిMీ కొన్ని రాష్ట్రాల్లో వీరే ఓట్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అభ్యర్థుల జయాజయాల్లో భారతీయ అమెరికన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

4.5 మిలియన్ల మంది ప్రజలను కలిగి ఉన్న భారతీయ–అమెరికన్‌ కమ్యూనిటీ ముఖ్యంగా ఫ్లోరిడా, జార్జియా, అరిజోనా, వర్జీనియా, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో అభ్యర్థుల జయాపజయాల్లో భారతీయ అమెరికన్లదే కీలక పాత్ర.

ఈ నేపథ్యంలో భారతీయుల మద్దతు పొందేందుకు రెండు పార్టీలు.. రిపబ్లికన్, డెమోక్రటిక్‌ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. మరి భారతీయ అమెరికన్లు ఎవరిని కరుణిస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News