మాల్దీవులొద్దు..లక్షద్వీప్ ముద్దు!
మాల్దీవుల్ని మించి అందమైన లొకేషన్లు ఇండియాలో ఎన్నోచోట్ల ఉన్నాయి. అన్నింటిలోనూ లక్షద్వీప్ ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.
మాల్దీవుల్ని మించి అందమైన లొకేషన్లు ఇండియాలో ఎన్నోచోట్ల ఉన్నాయి. అన్నింటిలోనూ లక్షద్వీప్ ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆ అందమైన ద్వీపంలొ మాత్రం షూటింగ్ లు చాలా రేర్ గా జరుగుతుంటాయి. సెలబ్రిటీలకు...పర్యాటలకు అవసరమైన అన్ని రకాల వసుతులు ఏర్పాటు చేస్తే మాల్దీవుల్ని మించిన బ్యూటీ లక్షద్వీపంలో కనిపిస్తుంది. కానీ టూరిజం అక్కడ పెద్దగా అభివృద్దిలోకి తీసుకురాలేదు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ ద్వీపం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. డెవలెప్ చేయగల్గితే ఎంతో గొప్ప పర్యాటక...సినిమా షూటింగ్ లకు..సెలబ్రిటీల ఆస్వాదనకు ఎంతో అనువుగా ఉంటుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. మాల్దీవులకు వెళ్తోన్న ఆదాయం అంతా లక్షద్వీప్ ఖాతాలో చేరుతుంది. తాజాగా లక్ష్యదీపులకు మద్దతుగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఓ పోస్ట్ చేసింది. ఇక నుంచి మాల్దీవుల్లో షూటింగ్ చేయనని మా టీమ్ కి చెప్పేసాను.
మాల్దీవులంటే నాకు ఎంతో ఇష్టం. కానీ ఇక నుంచి మాత్రం అక్కడికి వెళ్లను. తర్వాత షెడ్యూల్ మాల్దీవుల్లో ఉంటడంతో అక్కడి రాను అని చెప్పేసాను. దానికి టీమ్ కూడా ఒప్పుకుంది. లక్షద్వీప్ లో షూటింగ్ చేస్తారని ఆశిస్తున్నా` అని ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. పూనమ్ పాండే ట్వీట్ కి అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంచి పని చేసిందని..సెలబ్రిటీలంతా కలిసి కట్టుగా లక్ష ద్వీప్ ని అభివృద్దిలో కి తెచ్చుకోవాలని నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల వెకేషన్ స్పాట్ గా మాల్దీవులు ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఏపీలో చూసుకుంటే వైజాగ్ ఎంతో ఫేమస్. ఇక్కడి అందాలు షూటింగ్ కి ఎంతో అనుకూలం. విశాఖ బీచ్ అంటే? ఎంతో అందమైనదిగా భావిస్తారు. బీచ్ తీరాన్ని మొత్తాన్ని అభివృద్దిలోకి తీసుకురాగలిగితే గొప్ప పర్యాటక ప్రాంతం అవుతుంది. టాలీవుడ్ సినిమా షూటింగ్ లకు ఎంతో అనువుగా ఉంటుంది. ఈ రకమైన ఆలోచన ప్రభుత్వాల దృష్టిలో ఉంది. అయితే వాటిని ఇంకా అమలు పరచలేదు.