నెలకు రూ.4 కోట్లు.. ఇండియాలోనే రిచ్చెస్ట్ యూట్యూబర్!
ఈ నేపథ్యంలో... అతడు ఎవరు.. ఏమి చదువుకున్నాడు.. ఎంత సంపాదిస్తున్నాడు.. మొదలైన విషయాలను ఇప్పుడు తెలుస్తుంది.
చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉన్నంతలో భాగానే సక్సెస్ అవుతుంటారు. మరికొంతమంది మధ్యలోనే కాడి దింపేస్తుంటారు. ఇంకొంతమంది యూట్యూబ్ ద్వారా వచ్చిన ఫేం తో సినిమాల్లో సెటిల్ ఐపోతుంతారు. ఈ క్రమంలో... యూట్యూబ్ ఛానల్ తో భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో ఆర్జిస్తున్నాడు ఒక యూట్యూబర్. ఈ నేపథ్యంలో... అతడు ఎవరు.. ఏమి చదువుకున్నాడు.. ఎంత సంపాదిస్తున్నాడు.. మొదలైన విషయాలను ఇప్పుడు తెలుస్తుంది.
చదువుకీ, డబ్బులు సంపాదించడానికి ఏమాత్రం సంబంధం లేదని చెబుతుంటారు.. ఇప్పటికే చాలా మంది నిరూపించారు కూడా! అయితే... అకడమిక్ చదువులు వేరు జ్ఞానం వేరు అనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు! మనవద్ద ఏ టాలెంట్ ఉంటే దానికే పదునుపెట్టుకుంటూ పోతే.. డబ్బు దానంతట అదే వస్తుందని చెబుతుంటారు. అది నిరూపించిన వ్యక్తులు ఒకరు ఫరిదాబాద్ కి చెందిన అజయ్ నగార్ అనే యువకుడు!
అవును... అజయ్ నగార్ కేవలం చిన్న వయసులోనే యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో "అడిక్టెడ్" అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అజయ్... అనంతరం ఆ చానల్ పేరును "క్యారీ డియోల్"గా మార్చాడు. ఆ చానాల్ లో గేం ప్లే ఫుటేజిని అప్ లోడ్ చేయడం దగ్గరనుంచి.. సన్నీ డియోల్ ని అనుకరించడం వరకూ ఎన్నో చేశాడు!
ఈ క్రమంలో "యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్: ది ఎండ్" అనే వీడియోకి ఆరు రోజుల్లోనే సుమారు 72.2 మిలియన్ల వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ అయ్యిందట. అక్కడ నుంచి ఫాలోవర్స్ ఒక రేంజ్లో పెరిగిపోతున్న సమయంలో... చానల్ పేరు "క్యారీమీనాటీ" గా మార్చాడు. ఇంతకీ దీని అర్ధం ఏమిటి అని అడిగితే మాత్రం... తనకూ తెలియదని, సౌండ్ బాగుందని పెట్టినట్లు చెబుతుంటాడు!
ఈ నేపథ్యంలో... ప్రస్తుతం అతడి ఆదాయం నెలకు సుమారు 4 కోట్లు అని పలు నివేదికలు చెబుతుండగా... సరాసరిన వార్షిక ఆదాయం 42 కోట్ల రూపాయలని అంటున్నారు. దీంతో... ఈ హౌస్కూల్ డ్రాపౌట్ వ్యక్తి ఈస్థాయిలో సంపాదిస్తుండటంతో... అనుకుంటే సాధించనిదేమున్నదీ... అని అంటున్నారు నెటిజన్లు.. ప్రయత్నలోపం ఉండకూడదంతే!!