హైదరాబాద్ కు వచ్చే ఇండిగోకు బాంబు బెదిరింపు

హైదరాబాద్ కు రావాల్సిన ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు రావటంతో తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుంది.

Update: 2024-09-01 15:22 GMT

హైదరాబాద్ కు రావాల్సిన ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు రావటంతో తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుంది. అయితే.. విమాన సిబ్బంది.. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో హైడ్రామా చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నుంచి హైదరాబాద్ కు ఈ రోజు (ఆదివారం) ఉదయం 7.55 గంటలకు ఇండిగో విమానం బయలుదేరింది.

సుమారు తొమ్మిదిగంటల సమయంలో ఒక ప్రయాణికుడు టాయిలెట్ కు వెళ్లగా.. టాయిలెట్ సీటు మీద.. బ్లాస్ట్ అన్న అక్షరాలతో ఒక పేపర్ ఉండటంతో సదరు ప్రయాణికుడు.. వెంటనే ఈ సమాచారాన్ని విమాన సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో.. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి అందజేసి.. అత్యవసరంగా మహారాష్ట్రలోని నాగపూర్ లో అత్యవసరంగా దింపేశారు.

ఈ ఉదయం 9.20 గంటల వేళలో నాగపూర్ లో అత్యవసరంగా విమానాన్ని కిందకు దించేసిన సిబక్బంది.. ముందస్తు జాగ్రత్తగా ఎమర్జెన్సీ సిబ్బంది.. అంబులెన్స్ లను ఎయిర్ పోర్టులో సిద్దంగా ఉంచారు. ప్రయాణికుల్ని.. వారి లగేజ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే.. ఎలాంటి పేలుడు పదార్థం లభించలేదు. అయినప్పటికీ మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. విమానంలో 69 మంది ప్రయాణికులు.. నలుగురు సిబ్బంది ఉన్నారు. ఆ విమానాన్ని అక్కడే ఉంచేసి.. ప్రయాణికుల్ని నాగపూర్ నుంచి హైదరాబాద్ కు బస్సులో తరలిస్తున్నారు. దీంతో.. విమాన ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News