ఇండిగో: బిజినెస్ లో తోపు.. లాభాల్లో మాత్రం నేలచూపు!
ఇండిగో.. దేశీయ విమానయాన రంగంలో తోపు. దేశీయంగా రూటు ఏదైనా ఇండిగో విమాన సర్వీసులు పది ఉంటే.. మిగిలిన అన్నీ కలిపి కూడా ఐదు కూడా ఉండని పరిస్థితి
ఇండిగో.. దేశీయ విమానయాన రంగంలో తోపు. దేశీయంగా రూటు ఏదైనా ఇండిగో విమాన సర్వీసులు పది ఉంటే.. మిగిలిన అన్నీ కలిపి కూడా ఐదు కూడా ఉండని పరిస్థితి. దేశీయంగా తిరుగులేని విధంగా దూసుకెళుతున్న ఇండిగో మూడో క్వార్టర్ ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి వచ్చిన లాభాలతో పోలిస్తే దాదాపు రూ.500 కోట్ల మేర లాభాలు తగ్గటం షాకింగ్ గా మారింది.
వ్యాపారం జోరున సాగుతున్న వేళ.. లాభాలు తగ్గటం ఏమిటి? ఎందుకిలా? అన్నది ప్రశ్న. ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలు కూడా భారీగా పెరిగాయి.గతంతో పోలిస్తే ఆక్యుపెన్సీలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఛార్జీల పెంపు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ. విడుదలైన ఇండిగో లాభాలు తక్కువగా ఉండటం ఎందుకు? కారణం ఏమిటి? అన్నది ప్రశ్నలుగా మారాయి.
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దీనికి ముందు ఫలితాల్ని చూస్తే.. 2024-25 మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబరు - డిసెంబరు నికర లాభం 18 శాతం క్షీణించి రూ.2450 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా కరెన్సీ ఆటుపోట్లు లాభాల్ని దెబ్బ తీశాయని చెప్పాలి. గత ఏడాది ఇదే కాలంలో రూ.2998 కోట్లను కంపెనీ ఆర్జించింది. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి.
ఇండిగో మొత్తం ఆదాయం రూ.20,062 కోట్ల నుంచి రూ.22,993 కోట్లకు పెరిగింది. ఇంధన వ్యయాలు తగ్గాయి. ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ కారణాలతో రూ.3850 కోట్ల లాభం ఆర్జించింది. ఈ మూడు నెలల కాలంలో 3.11 కోట్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చినట్లుగా పేర్కొంది. కాకుంటే అమెరికా డాలరుతో భారత రూపాయి మారకం విలువ తగ్గటం లాభాల మీద ప్రభావాన్ని చూపింది. నిజానికి కరెన్సీ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకుంటే.. కంపెనీ లాభం రూ.3850 కోట్లకు పెరిగినట్లుగా చెప్పాలి. కరెన్సీ ప్రభావం లాభాల మీద దాదాపు రూ.1400 కోట్ల మేర పడటం గమనార్హం.
ఇదిలా ఉండగా డిసెంబరు చివరి త్రైమాసికానికి ఇండిగో వద్ద 437 విమానాలు ఉండగా.. సదూర ప్రాంతాలకు మరిన్ని విమానాల్ని తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇంజిన్ సమస్యల కారణంగా 60 విమానాలు పని చేయకుండా ఉండిపోగా.. ఈ ఏడాది మొదటికి పని చేయకుండా ఉండే విమానాల సంఖ్యను 4.