హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థి సూసైడ్... కాలేజీపై సంచలన లెటర్!
అవును... చదువులో ఒత్తిడి భరించలేక.. ఈ విషయంలో కాలేజ్ లెక్చరర్స్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ ల వేధింపులు తట్టుకోలేక ఒక ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు! సూసైడ్ లెటర్ రాసి తనువు చాలించాడు.
ఇటీవల కాలంలో బోలెడంత వయసు, భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా.. కన్నవారికి పుట్టెడు దుఃఖం మిగులుస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్యలకు ప్రేమ విఫలం, వ్యసనాలకు బానిసలవ్వడం వంటి కారణాలతోపాటు చదువు ఒత్తిడి కూడా మరో ప్రధాన కారణం అని అంటున్నారు! ఈ క్రమంలో తాజాగా ఇలాంటి సమస్యతొనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ వైఖరిని తప్పుపడుతూ లేఖ రాశాడు!
అవును... చదువులో ఒత్తిడి భరించలేక.. ఈ విషయంలో కాలేజ్ లెక్చరర్స్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ ల వేధింపులు తట్టుకోలేక ఒక ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు! సూసైడ్ లెటర్ రాసి తనువు చాలించాడు. ఈ లేఖలో మరిన్ని కీలక విషయాలను వెల్లడించిన ఆ విద్యార్థి... తాను చదివిన ఆ కాలేజీలో ఇంకెవరూ జాయిన్ కావొద్దని కోరాడటం గమనార్హం. దీంతో ఇష్యూ మరింత సీరియస్ అయ్యిందని తెలుస్తుంది!
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ శివారు మీర్ పేట జిల్లెలగూడకు చెందిన మంచాల వైభవ్ (16) చైతన్యపురిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక అతడు సూసైడ్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా సూసైడ్ లెటర్ రాసి, అనంతరం ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు!
కాలేజ్ లెక్చరర్స్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ వేధింపులు, ఒత్తిడి భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ విద్యార్థి తన సూసైడ్ లెటర్ లో వెల్లడించారు. ఇదే సమయంలో... ఎక్కువ మార్కుల కోసం కాలేజ్ లెక్చరర్ లు, యాజమాన్యం స్టూడెంట్స్ పై ఒత్తడి చేయొద్దని కోరాడు. అదేవిధంగా... తాను చదవిన ఆ కాలేజీలో మరెవరూ జాయిన్ కావద్దని లేఖలో పేర్కొన్నడం గమనార్హం.
ఇదే సమయంలో... తన అమ్మానాన్న క్షమించమని ఆ లేఖలో కోరిన విద్యార్థి... తన తమ్ముడిని మంచి కాలేజీలో చేర్పించాలని ఆ లేఖలో రాశాడు. ఈ సందర్భంగా అంతా తనను క్షమించాలని.. ఇదే తన చివరి రోజు అని ఆ సూసైడ్ లేఖలో వైభవ్ పేర్కొన్నాడు. ఇతడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరవుతున్నారు.
ఈ క్రమంలో... విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సమయంలో... కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి!