వైసీపీ మీద కొడాలి బాంబు... కట్ చేస్తే ?

శుక్రవారం పొద్దు పోయాక వైసీపీ సీనియర్ నేత రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకూ వైసీపీకి గుడ్ బై కొడుతున్నట్లుగా ప్రకటించడం సంచలనం రేపింది.

Update: 2025-01-24 18:02 GMT

వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. చిన్నా చితకా లీడర్లు కాదు పునాదుల నుంచి ఉన్న వారే వైసీపీకి గుడ్ బై కొట్టేస్తున్నారు. దానికి వారి కారణాలు వారికి ఉన్నాయని అంటున్నారు. ఎవరూ అనుకోని కలలో సైతం ఊహించలేని బిగ్ షాట్స్ పార్టీకి రాజీనామా అంటున్నారు. శుక్రవారం పొద్దు పోయాక వైసీపీ సీనియర్ నేత రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకూ వైసీపీకి గుడ్ బై కొడుతున్నట్లుగా ప్రకటించడం సంచలనం రేపింది.

దాంతో ఆ విషయం నుంచి వైసీపీ శ్రేణులు పూర్తిగా జీర్ణించుకునే లోపులోనే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటి అంటే వైసీపీ కి రాజకీయాలకు దూరం అవుతున్నానని ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి అయిన కొడాలి నాని ప్రకటించారు అన్నది.

ఈ న్యూస్ చాలా తొందరలోనే స్ప్రెడ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొడాలి నాని తాను అనారోగ్య కారణాల వల్లనే పార్టీకి దూరం అవుతున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో పాటుగా తనను ఇంతకాలం ఆదరించిన గుడివాడ ప్రజలకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.

అయితే ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో కొడాలి నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను పార్టీని వీడడం లేదని ఆయన ఖండించారు. తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని ఆయన కొట్టిపారేశారు దానిని ఎవరూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేసారు.

మొత్తం మీద చూస్తూంటే వైసీపీలో ఉన్న నేతల మీద ఈ రకమైన ప్రచారం సాగుతూడడంతో ఏది నిజం ఏది ఫేక్ అన్నది కూడా పార్టీ వర్గాలకు అంతు పట్టడం లేదు. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియక క్యాడర్ అయితే తికమక పడుతోంది.

నాయకులు మూగ నోము పట్టడంతో వారి మీద వచ్చే వార్తలు నిజం అని అనుకునే ప్రమాదం ఉంది అంటున్నారు వైసీపీ యాక్టివ్ అయితేనే తప్ప ఈ రకమైన రచ్చకు తెర పడదని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో ఇపుడు రాజీనామాల పర్వం కొనసాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఫ్యాన్ పార్టీలో ముందు ముందు ఏమేమి జరుగుతాయో.

Tags:    

Similar News