ఆదిత్య ఎల్ - 1 బడ్జెట్ ఎంతో తెలుసా... లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే!

దీంతో... ఇస్రో చేపట్టబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ఈ సమయంలో ఆదిత్య ఎల్ 1 తెరపైకి వచ్చింది

Update: 2023-08-29 07:56 GMT

చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వైపు ఇప్పుడు ప్రపంచం చూపు ఉందని చెప్పినా అతిశయోక్తి కాదు. చంద్రుడిపైకి చాలా దేశాలు వెళ్లినా... దక్షిణ దృవాన్ని టచ్ చేసింది మాత్రం ఇండియానే. దీంతో... అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘతన ఇస్రోకి దక్కింది.

దీంతో... ఇస్రో చేపట్టబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ఈ సమయంలో ఆదిత్య ఎల్ 1 తెరపైకి వచ్చింది. అవును.. చంద్రయాన్ - 3 సక్సెస్ అనంతరం సూర్యుని గురించి సమాచారాన్ని సేకరించేందుకు సెప్టెంబర్ 2, 2023న సూర్యుని దగ్గరకు ప్రయాణం చేయనుంది ఇస్రో.

అవును... మొట్ట మొదటి సోలార్ మిషన్ కు ఇండియా రెడీ అవుతోంది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 శ్రీహరికోట నుండి 2 సెప్టెంబర్ 2023న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించబడుతుంది. దీనికోసం ఆదిత్య-ఎల్1 సూర్యుని బయటి పొర పరిశీలన కోసం తయారు చేయబడింది.

ఇందులో భాగంగా... ఆదిత్య-ఎల్1 మిషన్ ఇస్రో పి.ఎస్.ఎల్.వి. రాకెట్‌ లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్, శ్రీహరికోట నుండి ప్రయోగించబడుతుంది. ప్రారంభంలో వ్యోమనౌక భూమి దిగువ కక్ష్యలో ఉంచబడుతుంది. ఆ తర్వాత ఈ కక్ష్య అనేక రౌండ్లలో భూమి కక్ష్య నుండి బయటకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తర్వాత దానిని ఉపయోగించి లాగ్రాంజ్ పాయింట్ (ఎల్1) వైపు ప్రయోగించబడుతుంది.

ఈ క్రమంలో ఈ మిషన్‌ కోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ఇండియా. అయితే డిసెంబర్ 2019 నుండి ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి పని జరుగుతోంది. తాజాగా ఈ మిషన్ పూర్తయ్యి.. ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మిషన్ ఏడు పేలోడ్‌ లను తీసుకువెళుతుంది.

అయితే ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనుంది ఇస్రో. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్, పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ ను అభివృద్ధి చేశాయి.

Tags:    

Similar News