ఐటీ హబ్ లో దేశద్రోహి... ఉగ్రవాదులతో సంబంధాలు?

ఇతడి వివరాలను తాజాగా పోలీసులు వెళ్లడించారు.

Update: 2024-06-21 10:05 GMT

పక్కింటి దొంగల కంటే.. ఇంటి దొంగలు మరీ ప్రమాదం అని, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని అంటుంటారు! తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో ఇంటి దొంగనైతే పట్టుకున్నారు కానీ.. అతడికి ఇంకా ఎన్నేన్ని రిలేషన్స్ ఉన్నాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇతడి వివరాలను తాజాగా పోలీసులు వెళ్లడించారు.

అవును... ఓ ఐటీ హబ్ లో పనిచేస్తూ, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తిని తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇతడి పేరు వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా... ఇతడి పేరు ఫహీమ్ ఫిర్ దాస్ ఖురేషీ అలియాస్ ఫహీమ్ అని.. ఇతడిని బెంగళూరు నగర శివార్లలోని అరెస్ట్ చేసినట్లు మదనాయకనహళ్లీ పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు! ఇతడు చాలా కాలం క్రితమే కాశ్మీర్ నుంచి బెంగళూరుకు వచ్చి చదువుకూడా అక్కడే పూర్తి చేశాడని అన్నారు. ఇలా చదువు పూర్తి చేసి.. అనంతరం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ గూడ్స్ (బీఐఈసీ)లో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడని తెలిపారు.

ఈ క్రమంలో... భారతదేశ జాతీయ సెంటిమెంట్ ను దెబ్బతీసి, సామాజిక శాంతిని ధ్వంసం చేసే వక్రబుద్ధి ఫాహీమ్ కలిగి ఉన్నాడని.. ఇతడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో భారత్ కు వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టాడని.. ఫలితంగా దేశద్రోహానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతడు పెట్టిన పోస్టులను పలువురు దేశ ద్రోహులు కూడా మెచ్చుకోవడం గమనార్హం.

ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ఫహీమ్ ల్యాప్ ట్యాప్, బైక్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో అతడిని విచారిస్తున్నామని తెలిపారు! ఇదే సమయంలో అతడు ఉద్యోగం చేసిన సంస్థలోనూ తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నారు.

Tags:    

Similar News