బాబు అరెస్ట్‌ సక్రమమే... షాకిచ్చిన ఐటీ ఉద్యోగులు!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబు అవినీతి చేయకపోతే అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

Update: 2023-09-17 09:31 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు కు మద్దతుగా అంటూ ఐటీ ఉద్యోగులు నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి, సైబర్ టవర్స్ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు కొంతమంది నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారి నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ సక్రమమే అంటూ భారీగా ఐటీ ఉద్యోగులు ఈ రోజు ప్రకటించారు. అవును.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేయడం కరెక్టే అంటూ, ఆ అరెస్టు సక్రమమే అంటూ ఐటీ ఉద్యోగులు తమ మద్దతు ప్రకటిస్తూ కార్ల ర్యాలీ తీశారు.

ఈ మేరకు ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కార్లలో ర్యాలీ చేపట్టారు. తమ కార్ల ర్యాలీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు సాగుతుందని ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా జై జగన్‌.. జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీని చేపట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబు అవినీతి చేయకపోతే అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నిన్న అవుటర్ రింగ్ రోడ్ పై పెయిడ్‌ ఆర్టిస్టులు చంద్రబాబుకు మద్దుతుగా ర్యాలీ చేశారని విమర్శించారు. ఇదే సమయంలో... అచ్చెన్నాయుడు బ్రతిమాలుకుంటే వారు ర్యాలీ చేపట్టారని అన్నారు.

అదేవిధంగా... రానున్న కాలంలోనూ చంద్రబాబు జైల్లోనే ఉంటారని తెలిపిన ఐటీ ఉద్యోగులు... హైటెక్‌ సిటీ కమాన్‌ ఒక్కటే చంద్రబాబు కట్టారని ఎద్దేవా చేశారు! పక్కన ఫైనాన్‌షియల్‌ డిస్ట్రిక్‌, గచ్చిబౌలి వచ్చింది వైఎస్సార్‌, కేసీఆర్‌ హయాంలోనే అని వారు తెలిపార్రు. వైఎస్సార్‌ హయాంలోనే శంషాబాద్ విమానాశ్రయం, రింగ్‌ రోడ్డు వచ్చాయని గుర్తుచేశారు.

చంద్రబాబు చేసిన స్కాంలో కనీస ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌ ఇచ్చిందని.. అందుకే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని తెలిపారు.

కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ ఐటీ ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే!

Full View
Tags:    

Similar News