కారణం అత్యంత దారుణం... యూఎస్ లో ఇండియన్ ఫ్యామిలీ మృతి!

అమెరికాలోని ఒక ఐటీ ఫ్యామిలీలోని నలుగురు మెంబర్స్ ఒకేసారి మృతి చెందారు.

Update: 2024-02-14 07:12 GMT

అమెరికాలోని ఒక ఐటీ ఫ్యామిలీలోని నలుగురు మెంబర్స్ ఒకేసారి మృతి చెందారు. వారిలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లలు కూడా ఉండటంతో ఆ విషయం మరింత విషాదంగా మారింది. అయితే ఒకే కుటుంబంలోని ఆ నలుగురు వ్యక్తులూ ఒకేసారి మృత్యువాత పడటానికి గల కారణం అత్యంత షాకింగ్ గా ఉండటం ఇప్పుడు చర్చ నీయాంశం అయ్యింది.

అవును... ఇటీవల కాలంలో తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్, ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం కు చెందిన నికేష్ అనే ఇద్దరు యువకులు యూనివర్సిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్‌ లో కంప్యూటర్ సైన్స్‌ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం వీరి మరణానికి కార్బన్ మోనాక్సైడ్ (సీవో) కారణం అని తెలిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ కారణంతోనే ఈ ఫ్యామిలీ కూడా మృతి చెందిందని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... కాలిఫోర్నియాలో తాజాగా నలుగురు సభ్యుల కుటుంబం మృత్యువాత పడింది. ఇందుకు గల కారణం షాకింగ్ గా ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ కండిషనింగ్ సిస్టం నుంచి గ్యాస్ లీక్ అవ్వడమే వీరి మరణానికి కారణమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ల్యాబ్ రిపోర్టుల కోసం వేచి చూస్తున్న అధికారులు నివేదికను ఇంకా ధృవీకరించలేదు.

ఈ సందర్భంగా మృతులను నంద్ హెన్రీ (42), అతని భార్య అలిస్ ప్రియాంక (40), వారి కవల అబ్బాయిలు నోహ్ - నాథన్ (4) గా గుర్తించారు. ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఐటీ ఉద్యోగాల్లో పని చేస్తుండగా... ఈ జంట గత తొమ్మిదేళ్లుగా శాన్ మాటియో కౌంటీలో నివసిస్తున్నారు. వీరి ఫ్యామిలీ ఫోటో చూస్తూ.. వీరి శవాలను చూస్తున్నవారు హృదయ విదారకంగా ఉందని వాపోతున్నారు!

ఈ విషయాలపై స్పందించిన శాన్ మాటియో పోలీస్ డిపార్ట్‌మెంట్ పీఆర్వో జెరామి సురట్... విచారణ కొనసాగుతోందని, మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.

Tags:    

Similar News