వైసీపీలో ప్రమోషన్ లకు ఇదొక ఆసక్తికర మార్గం!!

ఈ క్రమంలో తాజాగా తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చె పనుల్లో బిజీగా ఉన్న జగన్.. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను నిమగ్నం చేసేందుకు వర్క్ షాప్ లు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-10-18 08:30 GMT

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నేతలతోనూ, కార్యకర్తలతోనే జగన్ మునుపటికంటే పూర్తి భిన్నంగా మమేకమవుతున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ నడుస్తోంది. కార్యకర్తలు, పార్టీ అధినాయకత్వం జోడేద్దుల బండి అనే విషయం పూర్తిగా అవలోకనం చేసుకున్న జగన్ ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చె పనుల్లో బిజీగా ఉన్న జగన్.. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను నిమగ్నం చేసేందుకు వర్క్ షాప్ లు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా తాడేపల్లిలో జరిగిన వర్క్ షాప్ లో జగన్.. సోషల్ మీడియా ప్రాముఖ్యతపై తన కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

ఇందులో భాగంగా సమకాలీన రాజకీయాల్లో సోషల్ మీడియా ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇదే సమయంలో ఈ విషయంలో నాయకుల బాధ్యతను గుర్తుచేశారు. ఇందులో భాగంగా.. వైసీపీలో నామినేటెడ్ నాయకుడికి సొషల్ మీడియాపై అవగాహన ఉండాలని.. గ్రామస్థాయి నాయకులకు కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉండాలని సూచించారు.

వాటిని ప్రధానంగా పార్టీ కోసం ఉపయోగించారని సూచించారు. ఇదే సమయంలో... సోషల్ మీడియాలో అత్యుత్తమ పనితీరు కనబరిచే నాయకులకు ప్రమోషన్లు ఇస్తామని జగన్ నొక్కి చెప్పారు. దీంతో... సాదారణంగా పార్టీ శ్రేణులకు ప్రమోషన్లు అనేవి గ్రౌండ్ లెవల్ లో పనితీరును బట్టి ఇస్తారు కానీ.. జగన్ మాత్రం ఆన్ లైన్ లో పనితీరుకు ఇస్తామని చెప్పడం ఆసక్తిగా మారింది.

ఇక.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలని.. అన్యాయాలను ప్రశ్నించాలని.. బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇదే సమయంలో... బాబు సర్కార్ పై ప్రజల్లో చర్చ మొదలైందని చెప్పిన జగన్... మనం చేసిన మంచిని జనం గుర్తు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News