కన్ఫ్యూజన్ గా మారిన జగన్ లండన్ టూర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడింది.

Update: 2024-09-14 07:07 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడింది. కుమార్తెను కలిసేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ.. పాస్ పోర్టు వ్యవహారంలో ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన షరతులు ఆయన ప్రయాణం మీద ప్రభావాన్ని చూపాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? లండన్ వెళుతున్నారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

షెడ్యూల్ ప్రకారం చూస్తే.. సెప్టెంబరు 3 - 25 మధ్య ఆయన లండన్ వెళ్లాలనుకోవటం తెలిసిందే. దీనికి తగ్గట్లే షెడ్యూల్ ను సైతం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ఆయనకు ఉన్న డిప్లమాటిక్ పాస్ పోర్టు స్థానంలో సాధారణ పాస్ పోర్టుకు మారాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

ఆయన లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వగా.. పాస్ పోర్టు రెన్యువల్ విషయంలో విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొన్ని షరతుల్ని విధించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన లండన్ పర్యటనపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రజాప్రతినిధుల కోర్టు అభ్యంతరాలపై హైకోర్టును ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన పర్యటన అనుకున్నట్లుగా జరిగే అవకాశం లేదంటున్నారు. ఈ క్రమంలో ఆయన లండన్ వెళతారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇలాంటివేళలోనే.. జగన్మోహన్ రెడ్డి విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లటం ఇది తొమ్మిదిసారిగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లండన్ పర్యటనపై సందేహాలు నెలకొన్నాయి. కోర్టు ఆదేశాలకు తగినట్లుగా ఆయన పర్యటన మీద క్లారిటీ వచ్చే వీలుందని చెప్పాలి.

Tags:    

Similar News