అసెంబ్లీకి జగన్...ఫుల్ క్లారిటీ ఇచ్చేశారా ?

ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుంచి హెలికాప్టర్ లో ఆయన శ్రీకాకుళం జిల్లా పాలకొండ వెళ్ళి అక్కడ దివంగత వైసీపీ నేత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించారు.

Update: 2025-02-20 17:20 GMT

ఏపీలో జరిగే బడ్జెట్ సెషన్ ని జగన్ హాజరు కానట్లేనా అంటే విషయం చూస్తే అలాగే ఉంది అని అంటున్నారు. జగన్ గురువారం తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుంచి హెలికాప్టర్ లో ఆయన శ్రీకాకుళం జిల్లా పాలకొండ వెళ్ళి అక్కడ దివంగత వైసీపీ నేత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించారు.

అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జగన్ అటు నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్ళిపోయారని అంటున్నారు. ఇక చూస్తే ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి మొదలవుతున్నాయి. మూడు రోజుల వ్యవధి కూడా లేదు. జగన్ మాత్రం తాడేపల్లిలో ఆ సమయంలో ఉండడం లేదని అంటున్నారు.

దాంతో జగన్ ముందే మీడియా సమావేశంలో చెప్పినట్లుగా తాను తన పార్టీ అసెంబ్లీకి హాజరు కావడం లేదని స్పష్టం చేసినట్లు అయింది అంటున్నారు. ఇక తమకు విపక్ష హోదా ఇచ్చేందుకు ఏమిటి అభ్యంతరం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో ఒకే ఒక విపక్షం ఉందని దానికి అవకాశం ఇచ్చి హోదా ఇస్తే తప్పేంటి అన్నది జగన్ మార్క్ లాజిక్ పాయింట్ గా ఉంది.

అదే సమయంలో వైసీపీ ఈ ఇష్యూ మీద హైకోర్టుకు వెళ్ళింది. కోర్టు నుంచి ఈ విషయం మీద నోటీసులు అసెంబ్లీ స్పీకర్ ఆఫీసుకుని వచ్చాయి. దానికి స్పీకర్ ఆఫీసు బదులు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో స్పీకర్ ఫలానా సమయంలోగా జవాబు ఇవ్వాలని ఏమీ లేదు. దాంతో ఆ ఇష్యూ న్యాయపరంగా అలాగే ఉంది.

అయితే స్పీకర్ తాము కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కి జవాబు ఇవ్వాలని జగన్ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. మరి దీనికి అటు వైపు నుంచి కూడా అంతే స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఆనవాయితీ సంప్రదాయాలను అనుసరించి విపక్ష వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెబుతున్నారు.

జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు అందరి సభ్యుల మాదిరిగా సమయం ఇస్తామని అంటున్నారు. అయితే తనకు చంద్రబాబుతో సమానంగా మైకు ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. ఈ వివాదం ఇలా ఉండగానే అరవై రోజుల పాటు సభకు హాజరు కానీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు ఆటోమేటిక్ గా రద్దు అవుతాయని స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు చెబుతూ వస్తున్నారు.

అంటే మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుంది వారు అంటున్నారు. అయితే వారు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోనీయండి అని జగన్ మీడియా ముఖంగానే దీనికీ జవాబు చెప్పారు. మొత్తానికి చూస్తే జగన్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు అన్నది ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు. అంతే కాదు వైసీపీ నుంచి ఎవరూ రావడం లేదని అంటున్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు ఏమి అవుతాయన్నది అంతా ఆసక్తికరంగా చర్చినుకునేలా ఉంది. చూడాలి మరి రానున్న రోజులలో దీని మీద ఒక స్పష్టత అయితే రావచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News