పిఠాపురంలో జగన్ బస్సు...పవన్ కోసం కసరత్తు...!

ఈ సందర్భంగా ఆయన ఆనాడు చూపించిన ఫోకస్ ని అంచనా కట్టిన వైసీపీ నేతలు పవన్ అక్కడే పోటీ చేస్తారు అని భావించారు.

Update: 2024-03-21 02:30 GMT

పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించిన పవన్ ని ఓడించేందుకు వైసీపీ ఆ క్షణం నుంచే వ్యూహాలను రచిస్తోంది. నిజానికి చూస్తే ఇప్పటికి ఏడు నెలల క్రితమే పవన్ పిఠాపురంలో యాత్ర చేస్తూ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆనాడు చూపించిన ఫోకస్ ని అంచనా కట్టిన వైసీపీ నేతలు పవన్ అక్కడే పోటీ చేస్తారు అని భావించారు.

కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురంలో పోటీ చేయించడం వెనక వ్యూహం కూడా అదే అని అంటున్నారు. ఇక పవన్ పిఠాపురం పోటీ నేపధ్యంలో వైసీపీ అష్ట దిగ్బంధనం చేస్తోంది. పవన్ ని ఓడించేందుకు స్కెచ్ గీస్తోంది. పవన్ ని అడుగడుగునా కట్టడి చేయాలని చూస్తోని. ఆయన జనసేన అధినేతగా ఉన్నారు. ఆయన ఏపీవ్యాప్తంగా తిరగాలి. కానీ ఆయనను పిఠాపురంలోనే కట్టి పడేసేలా తమ సీరియస్ పొలిటికల్ యాక్షన్ తో వ్యవహరించాలని చూస్తోంది. దీని వల్ల పవన్ పూర్తిగా పిఠాపురానికే పరిమితం అవుతారని లెక్కలు వేస్తోంది.

ఇక పిఠాపురం నియోజకవర్గం మొత్తం బాధ్యతలు ఎంపీ మిధున్ రెడ్డి చూసుకుంటున్నారు. ఆయన గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే ఆయన వాటితో పాటు గా స్పెషల్ ఫోకస్ కేవలం పిఠాపురం మీదనే పెట్టబోతున్నారు అని అంటున్నారు.

ఆయనతో పాటుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాపు నేత ముద్రగడ పద్మనాభం వంటి వారిని పిఠాపురానికే వినియోగిస్తున్నారు. వీరంతా కలసి పిఠాపురంలో విస్తృతంగాపర్యటిస్తారు.

ఇదిలా ఉంటే పిఠాపురంలో జగన్ బస్సు యాత్రను కూడా ప్లాన్ చేశారు. ఏప్రిల్ మూడవ వారంలో జగన్ పిఠాపురంలో బస్సు యాత్ర చేస్తారు. ఒక రోజు మొత్తం ఆయన అక్కడ బస చేస్తారు. ఎన్నికల వ్యూహాలతో పాటు పార్టీని మొత్తం జనసేన టీడీపీ కూటమికి వ్యతిరేకంగా సిద్ధం చేస్తారు. మరో వైపు చూస్తే పిఠాపురంలో సామాజిక వర్గాల వారీగా కూడా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. కాపులలో ఓట్లు అరవై నలభై శాతంగా లెక్క వేసుకుంటోంది. అంటే అరవై ఓట్లు జనసేనకు వెళ్తే నలభై ఓట్లు వైసీపీకి పడతాయని భావిస్తోంది.

అందువల్ల బీసీలు ఈసీల ఓట్ల మీద పూర్తిగా ఆధారపడుతోంది. ఈ రెండు వర్గాలు కలిపి లక్షా నలభై వేల చిలుకు ఉన్నాయి. పిఠాపురంలో అభ్యర్ధి గెలవాలి అంటే లక్షా పైన ఓట్లు రావాలి.తొంబై అయిదు వేలు ఉన్న కాపులలో ముప్పయి అయిదు వేల దాకా ఓట్లు వచ్చినా ఆ మిగిలిన డెబ్బై వేల ఓట్లను బీసీలు ఎస్సీల నుంచి సమకూర్చుకుంటే కనుక సునాయాసంగా విజయం సాధించవచ్చు అన్నది వైసీపీ ఎత్తుగడగా ఉంది.

Tags:    

Similar News