కొత్త ముఖాలకు ఛాన్స్.. జగన్ ప్రయోగం వెనుక..!
కానీ, పార్టీ మాత్రమే కొత్త. మడకశిరలో కొత్త ముఖం ఈర లక్కప్పకు అవకాశం ఇచ్చారు. కొవ్వూరులోనూ తరాలి వెంకట్రావుకు అవకాశం ఇచ్చారు.
తాజాగా వైసీపీ ప్రకటించిన 8 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం ఇంచార్జ్‌లను గమనిస్తే.. ఐదుగురు సిట్టింగులను పక్కన పెట్టేసింది. వీటిలో కనిగిరి, గోపాలపురం, మడకశిర, శింగనమల, నందికొట్కూరు ఉన్నాయి. ఇక్కడి సిట్టింగులకు పూర్తిగా టికెట్ లేకుండా పోయింది. ఇక, మిగిలిన వారిలో తానేటి వనితను నియోజకవర్గం మార్చగా, ఎంపీగా ఉన్న రెడ్డప్ప ను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామికి ఎంపీ టికెట్ ఇచ్చింది.
ఇక, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ అనే కొత్త ముఖానికి టికెట్ ఇచ్చారు. శింగనమలలో ఏకంగా టికెట్ రేసులో ఉన్న యామినీ బాలను అసలు పట్టించుకోకుండా.. సిట్టింగును సైతం పక్కన పెట్టి ఎం. వీరాంజనేయులు అనే కొత్తవారిని తీసుకువచ్చింది. నందికొట్కూరులో సిద్దార్థ రెడ్డి హవా కనిపించింది. ఆయన అనుచరుడుగా ఉన్న డాక్టర్ సుధీర్‌కు అవకాశం ఇచ్చారు. ఈయన కూడా ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తముఖమే. తిరువూరులో పార్టీ మారిన నల్లగట్ల స్వామి దాసుకు ప్రత్యక్ష రాజకీయాలు కొత్త కాదు.
కానీ, పార్టీ మాత్రమే కొత్త. మడకశిరలో కొత్త ముఖం ఈర లక్కప్పకు అవకాశం ఇచ్చారు. కొవ్వూరులోనూ తరాలి వెంకట్రావుకు అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. కీలకమైన ఎస్సీ నియోజకవర్గాల్లో అనూహ్య మైన మార్పులు. వైసీపీలోనే చర్చనీయాంశం అయ్యాయి. అయితే, ఈ మార్పుల వెనుక వైసీపీ పక్కా వ్యూహం ఉందని తెలుస్తోంది. నందికొట్కూరులో ఆర్థర్‌కు టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం లేదనే టాక్ వినిపిస్తోంది. పైగా రెడ్డి సామాజిక వర్గంలో ఆయన మైనస్ అయ్యారు.
ఇక, తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి వరుస విజయాలు దక్కించుకున్నా.. ఈ దఫా ఇక్కడ ప్రజలు మార్పు కోరుతున్నారు. దీంతో పాత ముఖం నల్లగట్టకు అవకాశం ఇచ్చారు. ఈయన గెలుపు తథ్యమనే వాయిస్ వినిపిస్తోంది. చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరుకు పంపించారు. ఈయన కూడా గెలుపు గుర్రం ఎక్కే అవకాశం ఉంది. మడకశిరలో ఎవరూ ఊహించని ఈర లక్కప్పకు ఛాన్స్ ఇవ్వడం మాత్రం ప్రయోగమేనని చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ.. మార్పులకే వైసీపీ శ్రీకారం చుట్టడంతో కొంత మార్పు కనిపిస్తుందనే అంచనాలు వస్తున్నాయి.