గ్రౌండ్ లెవెల్ దాకా...ఫుల్ ఫోకస్ తో జగన్...!

జగన్ ఫుల్ ఫోకస్ పార్టీ మీద పెట్టేశారు. జస్ట్ ఆరు నెలలు మాత్రమే గడువు ఉందని ఆయన ఇటీవల గడప గడప కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పేశారు.

Update: 2023-09-30 02:45 GMT

జగన్ ఫుల్ ఫోకస్ పార్టీ మీద పెట్టేశారు. జస్ట్ ఆరు నెలలు మాత్రమే గడువు ఉందని ఆయన ఇటీవల గడప గడప కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పేశారు. పార్టీ గ్రాఫ్ బాగుంది. దాన్ని ఇంకా జనంలో ఉంటూ పెంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇక పార్టీని జనంలో దగ్గరగా ఉంచితే అంత మంచి ఫలితాలు వస్తాయని జగన్ కి బాగా తెలుసు.

దాంతో పాటు ఇపుడు పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలతో ఆయన మీట్ అవాలని చూస్తున్నారు. అలాగే పార్టీకి గ్రాస్ రూట్ లెవెల్ లో కీలకంగా ఉన్న మండల ప్రెసిడెంట్లు, ఇతర అనుబంధ విభాగాల నాయకులతో నేరుగా ఇంటరాక్ట్ కావాలని జగన్ డిసైడ్ కావడం విశేషం. మండల నాయకులతో పాటు ఎంపీపీలు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంటున్నారు.

దానికి సంబంధించి ఆయన అక్టోబర్ 9న విజయవాడలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి నాలుగు వేల మందికి తక్కువ కాకుండా మండల వైసీపీ ప్రెసిడెంట్లు ఇతర బాధ్యులతో ముఖ్యమంత్రి ముఖాముఖీ సమావేశం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ గత యాభై రెండు నెలలుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించడంతో పాటు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలను వారి నుంచి అడిగి తెలుసుకుంటారు. అలాగే పార్టీకి జనంలో ఉన్న ఆదరణ గురించి కూడా ఫీడ్ బ్యాక్ సేకరిస్తారు అని అంటున్నారు.

.ఈ సందర్భంగా వైసీపీ కొత్త నినాదం అయిన వై ఏపీ నీడ్స్ జగన్ అన్న దాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికి అవసరం అయిన సూచనలు సలహాలతో పాటు దిశానిర్దేశం చేస్తారు అని అంటున్నారు. ఈ కార్యక్రమం తరువాత మరోసారి పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి చెందిన నేతలతో సర్పంచులు, ఇతర పంచాయతీ స్థాయి నేతలతో కూడా వైసీపీ అధినాయకత్వం భేటీ ఉంటుంది అని అంటున్నారు అలాగే బూత్ లెవెల్ క్యాడర్ తో కూడా జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు అవసరం అయిన ఏర్పాట్లు కూడా చేస్తారు అని అంటున్నారు.

మొత్తానికి ప్రతీ బూత్ లెవెల్ లో వైసీపీని పటిష్టం చేయడం ప్రతీ ఇంట్లో వైసీపీ స్లోగన్ బలంగా వినిపించేలా చేసుకోవడంతో పాటు పార్టీలో అట్టడుగు స్థాయి కార్యకర్తను తట్టి లేపి వచ్చే ఎన్నికల దిశగా నడిపించడానికే జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకుంటూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈసారి గెలుపు మళ్లీ బిగ్ సౌండ్ చేయాలని వై నాట్ 175 స్లోగన్ కి తగిన విధంగా ఉండాలని కూడా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News